Poco C61 Price: పోకో నుంచి అదిరిపోయే మొబైల్‌.. మైండ్ బ్లాంక్‌ అయ్యే ఫీచర్స్‌!

Thu, 21 Mar 2024-5:31 pm,

ఈ  Poco C61 స్మార్ట్‌ఫోన్‌ ప్రీమియం లుక్‌లో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే లాంచ్‌కి ముందే ఈ మొబైల్‌కి సంబంధించిన డిజైన్‌ లీక్‌ అయ్యింది. ఈ మొబైల్‌ ఫ్రాంట్‌ భాగంలో నోచ్డ్ డిస్‌ప్లేతో లభించబోతోంది. 

అలాగే ఈ మొబైల్‌ బ్యాక్‌లో కూడా నాచ్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇది రెండు కెమెరాలతో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు బ్యాక్‌ సెటప్‌లో LED ఫ్లాష్‌తో అందుబాటులో ఉంది.  

ఈ మొబైల్‌లోని ఎడమ వైపు ఉండే ఫ్రేమ్‌లో ట్రిపుల్ కార్డ్ స్లాట్ (2 SIM + 1 మైక్రో SD)ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా పవర్‌ బటన్‌తో సెటప్‌తో అందుబాటులోకి ఉంది. దీంతో పాటు కింది భాగంలో USB-C పోర్ట్ మైక్రోఫోన్‌లు కూడా లభిస్తున్నాయి.   

Poco C61 స్మార్ట్‌ఫోన్‌  Helio G36 SoC ప్రాసెసర్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఈ మొబైల్‌ రెండు స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో మొదటిది 4GBర్యామ్‌, 64GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 6GBర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో లభిస్తోంది.   

దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.71-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఇది ఫ్యూర్‌ LCD డిస్‌ప్లేతో రాబోతోంది. దీని స్క్రీన్‌ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో రాబోతోంది. దీంతో పాటు 500 నిట్స్ బ్రైట్‌నెస్‌ని కలిగి ఉంది.    

ఈ Poco C61 స్మార్ట్‌ఫోన్‌ త్రిపుల్‌ కెమెరా సెటప్‌తో లభిస్తోంది. ఇందులో 8MP ప్రైమరీ కెమెరాలను కలిగి ఉంటుంది. దీంతో పాటు 5MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి రానుంది. అలాగే  10W ఛార్జింగ్ సపోర్ట్‌తో రాబోతోంది. 

Poco C61 స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన లాంచింగ్‌ తేదిని ప్రకటించలేదు. కానీ 4GB ర్యామ్‌, 64GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్ భారతదేశంలో రూ.7,499 ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link