POCO X6 5G Discount Offer: ఆశ్యర్యపోకండి.. ఫ్లిఫ్‌కార్ట్‌లో 8GB ర్యామ్‌ POCO X6 5G మొబైల్‌పై రూ.10,650 డిస్కౌంట్‌.. ఎలా కొనాలో తెలుసా?

Wed, 25 Sep 2024-1:29 pm,

ఫ్లిఫ్‌కార్ట్‌లో బిగ్‌ బిలియన్‌ సేల్‌ ప్రారంభం కాకముందే కొన్ని మొబైల్స్‌పై అద్భుతమైన డిస్కౌంట్‌ ఆఫర్స్‌ను అందిస్తోంది. ఇందులో భాగంగా కొనుగోలు చేసేవారికి డెడ్‌ చీప్‌ ధరలకే మొబైల్స్‌ లభిస్తున్నాయి. ముఖ్యంగా వీటిపై అదనంగా డిస్కౌంట్‌ను కూడా అందిస్తోంది.

ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ పోకో బ్రాండ్‌ గతంలో లాంచ్‌ చేసిన POCO X6 5G స్మార్ట్‌ఫోన్‌పై కూడా ప్రత్యేకమైన డిస్కౌంట్ లభిస్తోంది. ముఖ్యంగా ఈ మొబైల్‌పై ఫ్లిప్‌కార్ట్‌ ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు అద్భుతమైన బ్యాంక్‌ ఆఫర్స్‌ లభిస్తున్నాయి.

ఇక ఈ మొబైల్‌ వివరాల్లోకి వెళితే, ఫ్లిఫ్‌కార్ట్‌లో ఇది మూడు కలర్‌ ఆప్షన్స్‌లో పాటు అంతేకాకుండా రెండు స్టోరేజ్‌లలో లభిస్తోంది. ఇందులో 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన కలిగిన మొబైల్‌పై 36 శాతం వరకు డిస్కౌంట్‌ లభిస్తోంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ అసలు ధర రూ.24,999 కాగా ఫ్లిఫ్‌కార్ట్‌ అందిస్తున్న ప్రత్యేకమైన సేల్‌లో భాగంగా దీనిని కొనుగోలు చేసేవారికి దాదాపు 36 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ మొబైల్‌ కేవలం రూ.15,999కే వస్తుంది.  

అలాగే ఈ POCO X6 5G స్మార్ట్‌ఫోన్‌ అత్యధిక తగ్గింపుతో కొనుగోలు చేయాలనుకునేవారు బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా వినియోగించవచ్చు. ఇందులో భాగంగా  Flipkart Axis బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి పేమెంట్‌ చేస్తే దాదాపు 5 శాతం డిస్కౌంట్‌ లభిస్తుంది.

అంతేకాకుండా HDFC బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌తో పేమెంట్‌ చేసేవారికి కూడా దాదాపు రూ.1,500 వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. ఇక ఈ బ్యాంక్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ అన్ని పోను దీనిని కేవలం రూ.14,499కే పొందవచ్చు.

అలాగే దీనిపై అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా లభిస్తోంది. దీనిని వినియోగించి కొనుగోలు చేసేవారికి దాదాపు రూ.10,650 ఎక్చేంజ్‌ బోనస్‌ డిస్కౌంట్‌ పొందవచ్చు.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link