Political Heroes: విజయ్, పవన్ కళ్యాణ్ సహా పొలిటికల్ పార్టీలు పెట్టిన హీరోలు వీళ్లే..

Sun, 04 Feb 2024-7:42 pm,

NTR (ఎన్టీఆర్): తెలుగు నాట అన్న ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీని 1982లో స్థాపించారు. అంతేకాదు పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు.

MGR (ఎమ్జీఆర్): అటు అన్న ఎన్టీఆర్ కంటే ముందు ముందు పార్టీ పెట్టి సీఎం అయిన హీరో ఎమ్జీఆర్. 1972లో అన్నాడీఎంకే పార్టీని స్థాపించారు. ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేసిన ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవ చేసారు. అంతేకాదు చనిపోయే వరకు సీఎంగానే ఉన్నారు.

శివాజీ గణేషన్‌:

ఎమ్జీఆర్ సమకాలికుడైన శివాజీ గణేషణ్ కూడా ముందు డీఎంకే పార్టీలో ఉండి.. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు.  కాంగ్రెస్ పార్టీ తరుపున రాజ్యసభ సభ్యుడిగా సేవలు అందించిన ఈయన 1988లో 'తమిళగ మున్నేట్ర మున్నయ్' అనే పార్టీని స్థాపించారు. కానీ ఈ పార్టీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపించలేదు.

దేవానంద్:   కేవలం దక్షిణాది హీరోలే కాదు.. ఉత్తరాది బాలీవుడ్ ముందు తరం అగ్ర హీరో దేవానంద్ 1980లో నేషనల్ పార్టీ ఆఫ్ ఇండియా అనే పార్టీ స్థాపించారు. ఎంతో ఆర్భాటంగా ప్రారంభమైన ఈ పార్టీ 1980 సాధారణ ఎన్నికల తర్వాత సోదిలో లేకుండా పోయింది.

నందమూరి హరికృష్ణ:

ఎన్టీఆర్ తనయుడు నందమూరి హరికృష్ణ 1999లో చంద్రబాబును విభేదించి అన్న తెలుగు దేశం పార్టీని స్థాపించారు. ఆ ఎన్నికల్లో గంట గుర్తుతో అన్ని స్థానాల్లో పోటీ చేసారు. కానీ కనీస ప్రభావం చూపించలేకపోయింది. దీంతో టీడీపీలో జాయిన్ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో తండ్రీ తనయులు ఇద్దరు పార్టీలు పెట్టారు. కానీ తండ్రి బాటలో కుమారుడు సక్సెస్ కాలేకపోయారు.

కమల్ హాసన్ : చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ల తర్వాత కమల్ హాసన్ కూడా 2018లో ఫిబ్రవరి 21న 'మక్కల్ నీది మయ్యమ్‌' అనే పొలిటికల్ పార్టీని స్థాపించారు.

చిరంజీవి: మెగాస్టార్ చిరంజీవి 2018లో ప్రజా రాజ్యం పార్టీని స్థాపించారు. అలవాటు లేని రాజకీయ రంగంలో సక్సెస్ కాలేకపోయారు. ఆ తర్వాత తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి రాజ్యసభ సభ్యుడు అయ్యారు. అంతేకాదు యూపీఏ 2లో మన్మోహన్ మంత్రి వర్గంలో కేంద్ర మంత్రిగా సేవలు అందించారు.

పవన్ కళ్యాణ్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2014 సార్వత్రిక ఎన్నికల ముందు జనసేన పార్టీని స్థాపించారు. ఆ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కూటమికి మద్ధతు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు పెట్టిన  అన్నదమ్ములుగా రికార్డులకు ఎక్కారు.

విజయశాంతి: పొలిటికల్ పార్టీలు పెట్టిన వాళ్లలో హీరోలే కాదు.. హీరోయిన్ కూడా ఉంది. బీజేపీతో రాజకీయ ఆరంగేట్రం చేసిన ఈమె.. 2009లో తల్లి తెలంగాణ పార్టీని స్థాపించింది. ఆ తర్వాత తన పార్టీని టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసింది.

రజినీకాంత్: రజినీకాంత్ గత కొన్నేళ్లుగా పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్టు వార్తలు వచ్చాయి. 'మక్కల్ సేవై కట్చి' అనే పార్టీని స్థాపించారు. కానీ తీరా అనారోగ్య సమస్యలు ఇతరత్రా కారణాల వల్ల రాజకీయ ఎంట్రీకి బ్రేకులు వేసారు.

విజయకాంత్ : దివంగత పద్మభూషణ్ అవార్డు గ్రహీత విజయ్ కాంత్ కూడా సినిమాల్లో సంచలన విజయాల తర్వాత రాజకీయాల్లో ప్రవేశించారు. 2005లో దేశీయ ముర్పేక్కు ద్రవిడ కళగం(DMDK)పార్టీని స్థాపించారు.

శరత్ కుమార్:

రాజకీయ పార్టీ పెట్టిన హీరోల్లో శరత్ కుమార్ ఉన్నారు. 2007లో ఈయన ఆల్ ఇండియా సమతువ మక్కల్ కచ్చి (AISMK) అనే పార్టీని స్థాపించారు.

కార్తీక్: ఒకప్పటి తమిళ లవర్ బాయ్ కార్తీక్ కూడా 2006లో రాజకీయాల్లో ప్రవేశించారు. 2009లో 'అహిలా ఇండియా నాడలుమ్ మక్కల్ కచ్చి' అనే పార్టీని స్థాపించారు. ఈ పార్టీ పెద్దగా ప్రభావం చూపించలేదు. ఈ పార్టీ పెద్దగా ప్రభావం చూపించలేదు. అటు 2018లో 'మనిత ఉరైమైగల్ కాక్కుమ్ కచ్చి' అనే పొలిటికల్ పార్టీని స్థాపించారు. ఆ పార్టీ ఎన్నికల్లో  అన్నాడీఎంకే, బీజేపీతో పొత్తు పెట్టుకుంది. కానీ పెద్దగా ప్రభావం చూపించలేదు.

విశాల్: విశాల్ కూడా తన ఫ్యాన్ క్లబ్ 'మక్కల్ నాలా ఇయక్కమ్'ను పొలిటికల్ పార్టీగా మార్చారు. ఎన్నికల్లో పోటీ మాత్రం చేయలేదు.

ఉపేంద్ర: కన్నడ స్టార్ నటుడు ఉపేంద్ర 2018లో 'ప్రజాకీయ' పార్టీని స్థాపించారు. 2019 ఎన్నికల్లో ఈ పార్టీ తరుపున పోటీ చేసినా.. ఎక్కడా పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది.

విజయ్: హీరో విజయ్ ఎస్.ఏ.చంద్రశేఖర్ తన కుమారుడు పేరిట.. 'ఆల్ ఇండియా తలపతి విజయ్ మక్కమ్ ఇయ్యక్కుమ్' పార్టీ కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. కానీ పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. తాజాగా ఈ నెల 2న 'తమిళగ వెట్రి కళగం' అనే పార్టీని స్థాపించి రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link