Trisha Krishnan Pics: శారీలో త్రిష కృష్ణన్.. వయసు పెరుగుతున్నా అందం మాత్రం తగ్గట్లేదు!

Sun, 14 May 2023-8:27 pm,

త్రిష కృష్ణన్ తాజాగా సాంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. యెల్లో శారీలో అందాల రాశిలా మెరిసిపోతున్నారు. త్రిష వయసు పెరుగుతున్నా అందం మాత్రం ఇసుమంత కూడా తగ్గట్లేదు.   

పీఎస్ 1 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన త్రిష కృష్ణన్.. కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌తో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం పీఎస్ 2 ప్రమోషన్లతో ఆమె బిజీగా ఉన్నారు.   

తెలుగుతో పాటు తమిళంలోనూ త్రిష స్టార్ హీరోయిన్‌గా సత్తాచాటారు. ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటించి మెప్పించారు. గతకొంత కాలంగా చెన్నై చిన్నది ఆచితూచి సినిమాలు చేస్తున్నారు.   

2004లో ప్రభాస్ హీరోగా వచ్చిన 'వర్షం' సినిమాతో త్రిష తెలుగు ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి, అతడు, ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే సినిమాలతో స్టార్ హీరోయిన్ అయ్యారు.   

పలు యాడ్స్ చేసిన త్రిష కృష్ణన్ దర్శుకుల కళ్లలో పడ్డారు. 2003లో వచ్చిన 'నీ మనసు నాకు తెలుసు' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు.   

1983 మే 4 చెన్నై మహానరంలో త్రిష కృష్ణన్ జన్మించారు. అందాల పోటీలలో మిస్ చెన్నైగా ఎంపికై తర్వాత మిస్ ఇండియా అందాల పోటీలలో పాల్గొన్నారు.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link