Pooja Hegde: హాట్ ఫోటో షూట్ లతో అదరగొడుతున్న బుట్ట బొమ్మ..

Mon, 06 Sep 2021-3:54 pm,

నాగ చైతన్య ‘ఒక లైలా కోసం’ (Oka Laila Kosam)తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన పూజ హెగ్డే (Pooja Hegde )... కొద్ది సమయంలోనే చాలా పాపులర్ అయిపోయింది. తెలుగులో కొంచెం గ్యాప్ వచ్చిన తరువాత అవకాశాలు చేజిక్కుంచుకొని తెలుగులో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది. 

Photo courtesy : Instagram

నిజానికి పూజా.. తెలుగులో ఒక లైలా కోసం సినిమాలో చేసిన తరువాత బాలీవుడ్ లో హృతిక్ రోషన్ (Hrithik Roshan)సరసన మొహంజో దారో (Mohenjo Daro) సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా నడవకపోవటంతో మళ్లి దక్షిణ భారత సినిమాలపై ఫోకస్ చేసింది. 

Photo courtesy : Instagram

తెలుగులో టాప్ హీరోల పక్కన జత కట్టింది.. మహేష్‌తో (Mahesh Babu)‘మహర్షి’ (Maharshi), త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అరవింద సమేత’ (Aravinda sametha), ‘అల..వైకుంఠపురములో..’(Ala vaikunta puramulo) సినిమాలతో అందరి చూపును తన వైపు తిప్పుకుంది. ప్రస్తుతం, 

Photo courtesy : Instagram

ప్రభాస్‌తో (Prabhas) ‘రాధే శ్యామ్’(Radhe Shyam), అక్కినేని అఖిల్ పక్కన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ లలో నటిస్తుంది. అలాగే బాలీవుడ్ లో ‘హౌస్ ఫుల్ 4’ రణ్‌వీర్ సింగ్ హీరోగా తెరకెక్కుతున్న ‘సర్కస్’ సినిమా మరియు తమిళ్ లో దళపతి విజయ్ ‘బీస్ట్’ సినిమాలో కూడా నటిస్తుంది, 

Photo courtesy : Instagram

మొదటగా పూజా హెగ్డే "దువ్వాడ జగన్నాథం"తో (Duvvada Jagannatham) తెలుగు లో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చిన సినిమా 'అల..వైకుంఠపురములో..' ఈ సిమిమాతో అందరికి సుపరిచితమైన పూజా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. 

Photo courtesy : Instagram

చేతి నిండ సినిమాలు, కాస్త విరామం లేకుండా షూటింగ్ లకు హాజరవుతున్న ఈ సుందరి కాస్త కూడా దొరికితే చాలు హాట్ ఫోటో షూట్ లతో ఆకర్షిస్తుంది. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. హాట్ ఫోటోలతో ఫాలోవర్ లను పెంచుకుంటుంది.  Photo courtesy : Instagram

అటు సౌత్, ఇటు నార్త్ సినిమాలతో బిజీ అయిన ఈ భామ కొత్తగా మహేష్‌- త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందబోతున్న కొత్త సినిమాలోనూ హీరోయిన్‌గా పూజానే కన్ఫమ్‌ అవ్వగా  `ఆచార్య`లో రామ్‌చరణ్‌తో జోడీ కట్టింది. 

Photo courtesy : Instagram

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link