Poonam Kaur: ఆ డైరెక్టర్ నటికి కడుపు చేసాడు- పూనమ్ షాకింగ్ ట్వీట్..!

Wed, 09 Oct 2024-6:52 pm,

సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన పూనమ్ కౌర్ ఈమధ్య కాలంలో ఎక్కువగా త్రివిక్రమ్ ను టార్గెట్ చేస్తూ వరుస ట్వీట్లు పెడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తనకు సినిమాలలో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి , తనని వాడుకొని అసలు అవకాశాలు ఇవ్వకుండా తనను దూరం పెట్టారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సినీ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అసలు త్రివిక్రమ్, పూనమ్ కౌర్ మధ్య ఏం జరిగింది అనే విషయం మాత్రం ఇప్పటి వరకు ఎవరికీ తెలియదనే చెప్పాలి. 

ఇక నిన్నటి కి నిన్న ప్రముఖ నిర్మాత చిట్టిబాబు..” పూనమ్ కౌర్ కి పిచ్చి పట్టింది. అందుకే పిచ్చి మాటలు మాట్లాడుతోంది” అంటూ కామెంట్ చేశారు. దీంతో మండిపోయిన పూనమ్ కౌర్.. అసలు మీకు నిజం తెలుసో లేదో.. నేను ఎప్పుడో ఫిలిం ఛాంబర్ లో త్రివిక్రమ్ పై కంప్లైంట్ చేశాను. మీకు దమ్ముంటే వెళ్లి త్రివిక్రమ్ ను ప్రశ్నించండి. ఒకవేళ ఆ దమ్ము లేకపోతే ఇలాంటి మాటలు మాట్లాడకండి అంటూ గట్టి కౌంటర్ ఇచ్చింది పూనమ్ కౌర్.

అయితే ఇప్పుడు మరొకసారి సంచలన ట్వీట్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. తాజాగా పూనమ్ కౌర్ ట్విట్టర్ ఖాతా ద్వారా.. ఒక డైరెక్టర్ పంజాబీ నటిని గర్భవతిని చేశాడు.  అదృష్టవశాత్తు MAA కారణంగా ఆ అమ్మాయికి కొంతవరకు సహాయం లభించింది అంటూ కామెంట్ చేసింది.  అయితే పూనమ్ పోస్ట్ చేసిన ఆ డైరెక్టర్ ఎవరు..?  ఆ బాధిత యువతి ఎవరు..?  అనే విషయం మాత్రం ఏమి చెప్పలేదు. 

దీనికి తోడు ఈమె మాట్లాడుతూ.. అతడు ఒక రాజకీయ నాయకుడు కానీ నటుడు కాదు అంటూ హింట్ ఇచ్చింది. అంతేకాదు తనను, ఒక నటుడిని , రాజకీయ వ్యక్తిని లాగుతూ తమపై అసత్య ఆరోపణలు చేశారంటూ కూడా పోస్ట్ పెట్టింది పూనమ్.

మొత్తానికి అయితే పూనమ్ త్రివిక్రమ్,  పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ వరుస ట్వీట్ లు పెడుతున్నా.. వీరిద్దరూ మాత్రం ఏ విషయంపై స్పందించకపోవడంతో సరికొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link