Potato Balls: కరకరలాడే పొటాటో బాల్స్ .. ఇంట్లో తయారు చేసుకోండి ఇలా!
పదార్థాలు: బంగాళాదుంపలు - 4-5 , గోధుమ పిండి - 1/2 కప్పు, మొక్కజొన్న పిండి - 1/4 కప్పు, నూనె - వేయడానికి తగినంత
చీజ్ - 1/2 కప్పు (కరిగించినది), గుడ్డు - 1, ఉల్లిపాయ - 1 (చిన్నగా తరిగినది), కారం పొడి, ఉప్పు, కొత్తిమీర - రుచికి తగినంత
తయారీ విధానం: బంగాళాదుంపలను బాగా కడిగి, ఒక పాత్రలో వేసి నీరు మరిగించి, ఉడికించాలి.
ఉడికిన తర్వాత వాటిని తొక్క తీసి, ఫోర్క్ లేదా మాషర్‌తో మెత్తగా చేయాలి.
మెత్తగా చేసిన బంగాళాదుంపలకు, తరిగిన ఉల్లిపాయ, చీజ్, గుడ్డు, కారం పొడి, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలపాలి.
ఈ మిశ్రమం నుంచి చిన్న చిన్న బాల్స్ చేయాలి.
ప్రతి బాల్‌ను ముందుగా గోధుమ పిండిలో, తర్వాత గుడ్డులో, చివరగా బ్రెడ్‌క్రంబ్స్‌లో వేసి కోట్ చేయాలి.
కడాయిలో నూనె వేసి వేడి చేసి, ఈ బాల్స్‌ను వేయాలి. బంగారు రంగులోకి మారే వరకు వేయాలి.
వేయించిన పొటాటో బాల్స్‌ను టమాటా సాస్ లేదా చట్నీలతో సర్వ్ చేయండి.