Prabhas: ‘కల్కి’ సహా ప్రభాస్ రీసెంట్ మూవీస్ టోటల్ కలెక్షన్స్.. ఎవరికీ అందనంత ఎత్తులో రెబల్ స్టార్..
మొత్తంగా ఐదు సినిమాల కలెక్షన్స్ కలిపితే..రూ 830 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. గత రెండు చిత్రాలతోనే రూ. 500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టడం విశేషం. మొత్తంగా ఒక్కో సినిమాకు యావరేజ్ గా రూ. 166 కోట్ల షేర్ రాబట్టింది. ఓ రకంగా తెలుగులో మరే హీరో ప్రభాస్ దరిదాపుల్లో లేరనే చెప్పాలి.
సాహో.. సుజిత్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మూవీ ‘సాహో’. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 451 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 113 కోట్ల షేర్ రాబట్టింది.
రాధే శ్యామ్..
రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన చిత్రం ‘రాధే శ్యామ్’. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 150 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.73 కోట్ల షేర్ రాబట్టింది.
ఆదిపురుష్..
ఓం రౌత్ డైరెక్షన్ లో ప్రభాస్ రాఘవగా నటించిన మూవీ ‘ఆదిపురుష్’. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 400 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి టాప్ లో నిలిచింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 111 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
సలార్ పార్ట్ -1 సీజ్ ఫైర్..
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సలార్ పార్ట్ -1 సీజ్ ఫైర్’. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 700 కోట్ల గ్రాస్ వసూల్లను సాధించింది. తెలుగులో ఈ సినిమా రూ. 222 కోట్ల షేర్ రాబట్టి సంచలనం రేపింది.
కల్కి 2898 AD.. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కల్కి 2898 AD’. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర దాదాపు రూ.1111 కోట్ల గ్రాస్ వసూళ్ల ను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 311 కోట్ల షేర్ రాబట్టి సంచలనం రేపింది.