Pranitha Subhash: మరోసారి ప్రెగ్నెంట్ అయిన ప్రణీత సుభాష్.. ? లేటెస్ట్ పిక్స్ అర్ధం అదేనా.. !

Fri, 26 Jul 2024-9:35 am,

ప్రణీత సుభాష్.. స్వతహాగా కన్నడ భామ అయినా.. తెలుగు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కన్నడలో ఈమె దర్శన్ హీరోగా నటించిన ‘పొక్కిరి’ మూవీతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘పోకిరి’ మూవీకి కన్నడ రీమేక్.

తెలుగులో ‘ఏం పిల్లో .. ఏం పిల్లడో’ మూవీతో ఎంట్రీ ఇచ్చింది ఈ కన్నడ కస్తూరి. ఆ తర్వాత సిద్ధార్ధ్ హీరోగా తెరకెక్కిన ‘బావ’.. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘అత్తారింటికీ దారేది’ సినిమాలో బాపు బొమ్మగా తెలుగు ప్రేక్షకులను అలరించింది ప్రణీత.

ఆ తర్వాత మంచు ఫ్యామిలీ హోల్ సేల్ గా నటించిన ‘పాండవులు పాండవులు తుమ్మెదా’ సినిమాలో ప్రణీత యాక్టింగ్ కు మంచి మార్కులే పడ్డాయి.  అటు ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘రభస’, మహేష్ బాబుతో ‘బ్రహ్మోత్సవం’ సినిమాల్లో నటించినా.. సెకండ్ హీరోయిన్ గానే పరిమితమైంది.

సినిమాల్లో మంచి పేరు వచ్చినా.. స్టార్ డమ్ మాత్రం రాలేదు. అందుకే పెళ్లి చేసుకొని సెటిలైపోయింది. అంతేకాదు మ్యారేజ్ తర్వాత కూడా తన అందాల ప్రదర్శనలో ఎక్కడా తగ్గడం లేదు. అంతేకాదు లాస్ట్ ఇయర్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

తాజాగా ప్రణీత..పాంట్ సరిపోవడం లేదంటూ తన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. అంతేకాదు వేసుకునే పాంట్స్ సరిపోవడం లేదంటూ కామెంట్స్ చేసింది. దీన్ని బట్టి ప్రణీత మరోసారి తల్లి కాబోతుందా.. అనే డౌట్స్ అభిమానుల్లో మొదలయ్యాయి. దీనిపై ప్రణీతనే క్లారిటీ ఇస్తే బాగుంటుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link