Pranitha Subhash: పెళ్లై ఓ బిడ్డకు తల్లైనా ఎక్కడ తగ్గని ప్రణీత గ్లామర్ ట్రీట్.. లేటెస్ట్ పిక్స్ వైరల్..
ప్రణీత సుభాష్.. స్వతహాగా కన్నడ భామ అయినా.. తెలుగులో తన సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కన్నడలో ఈమె దర్శన్ హీరోగా నటించిన ‘పొక్కిరి’ మూవీతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘పోకిరి’ మూవీకి కన్నడ రీమేక్.
తెలుగులో ‘ఏం పిల్లో .. ఏం పిల్లడో’ మూవీతో ఎంట్రీ ఇచ్చింది ఈ కన్నడ కస్తూరి. ఆ తర్వాత సిద్ధార్ధ్ హీరోగా తెరకెక్కిన ‘బావ’.. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘అత్తారింటికీ దారేది’ సినిమాలో బాపు బొమ్మగా తెలుగు ప్రేక్షకులను అలరించింది.
ఆ తర్వాత మంచు ఫ్యామిలీ హోల్ సేల్ గా నటించిన ‘పాండవులు పాండవులు తుమ్మెదా’ సినిమాలో నటించింది. అటు ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘రభస’, మహేష్ బాబుతో ‘బ్రహ్మోత్సవం’ సినిమాల్లో నటించినా.. సెకండ్ హీరోయిన్ గానే పరిమితమైంది.
ప్రణీత సుభాష్ సినిమాల్లో మంచి పేరు వచ్చినా.. స్టార్ డమ్ మాత్రం రాలేదు. అందుకే పెళ్లి చేసుకొని సెటిలైపోయింది. అంతేకాదు మ్యారేజ్ తర్వాత కూడా తన అందాల ప్రదర్శనలో ఎక్కడా తగ్గడం లేదు. అంతేకాదు లాస్ట్ ఇయర్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
అంతేకాదు ప్రెగ్నేన్సీ తర్వాత సన్న బడడానికి జిమ్ లో తీవ్రమైన కసరత్తులు చేస్తోంది ఈ బాపు బొమ్మ. అంతేకాదు ఒకప్పటి గ్లామర్ తో హల్ చల్ చేస్తూ దూసుకుపోతుంది. అంతేకాదు నటిగా మంచి కథతో రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది.
ప్రణీత మాములు సాదాసీదా కథానాయిక కాదు. సమాజంలో జరగుతున్న సంఘటలపై స్పందిస్తూ ఉంటుంది. ఒక్కోసారి తన మార్క్ ట్వీట్ లతో ట్రోలర్స్ కు దొరికిపోతూ ఉంటుంది. మరోవైపు వాళ్ల అభిమానాన్ని చూరగొనడం ప్రణీత మార్క్ స్టైల్ అని చెప్పాలి.
కన్నడ, తమిళం, తెలుగు, హిందీ సినిమాల్లో నటించిన ప్రణీత సుభాష్.. మలయాళంలో మాత్రం నటించలేదు. ముఖ్యంగా ఈమె తన చారడేసి కళ్లతోనే అభిమానులకు చేరువ అయింది.