PRC Commission: ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్‌ అప్‌డేట్.. వేతన సవరణ కమిటీపై రిక్వెస్ట్

Wed, 18 Dec 2024-6:36 pm,

జీఓ 159 ద్వారా ఆక్టోబర్ 2, 2023లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శివశంకర్ చైర్మన్‌గా ఏర్పడిన వేతన సవరణ కమిటీ మొదటి ఆరు నెలలు అన్ని ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు జరిపి ప్రతిపాదనలను స్వీకరించి.. వివరాలు నమోదు చేసుకుందని  టీజీఓ తెలిపింది.  

ముఖ్యమంత్రి ఏప్రిల్ 2025 నుంచి వేతన సవరణ అమలు చేస్తామని హామీ ఇచ్చారని.. త్వరగా నివేదికను అందజేస్తే ప్రభుత్వం అద్యయనం చేసి అమలు చేయడానికి వీలు ఉంటుందని టీజీఓ నాయకులు తెలిపారు.  

ప్రభుత్వానికి అందజేసే ముందు పీఆర్‌సీ నివేదికలో పలు అంశాలను పరిగణించి.. పొందుపరచి ప్రభుత్వానికి అందించాలని ఏలూరి శ్రీనివాసరావు కోరారు. 1-1-2023, 1-7-2023, 1-1-2024, 1-7-2024 వరకు  పెండింగ్‌లో నాలుగు కరువు భత్యాలను ప్రభుత్వం ప్రకటించాల్సి ఉందని తెలిపారు.  

వీటిలో 1-1-2023, 1-7-2023 న ఇవ్వాల్సిన రెండు కరువు భత్యాలను వేతన స్థిరీకరణలో విలీనం చేసి.. మూల వేతనానికి  40 శాతం ఫిట్‌మెంట్‌ను కలిపి పీఆర్సీ అమలు చేయడానికి అనువుగా సిఫారసు  చేయాలని కోరారు.   

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 16 సంవత్సరాల 11 నెలలు అనగా.. 3 వేతన సవరణ కాలాలను, తెలంగాణలో 2 సంవత్సరాల, 7 నెలల కాలాన్ని ఉద్యోగ వర్గాలు తమకు న్యాయంగా రావాల్సిన సహజ హక్కు కోల్పోయారని  గుర్తు చేశారు.    

"పెరుగుతున్న ద్రవ్యోల్బణం, టోకు, వినియోగ ధరల సూచీ, వైద్య విద్య ఖర్చులతో ప్రభుత్వ ఉద్యోగులు సంక్షోభానికి లోనవుతున్నారు. గృహ, విద్యా రుణాల వాయిదాల చెల్లింపులో ఇక్కట్ల పాలవుతున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, తీసుకుంటున్న వేతనానికి తీవ్ర వ్యత్యాసం సతమవుతున్నారు. నెలకు కనీసంగా 20 వేల రూపాయలను అదనపు భారం పడుతోంది" అని ఆయన అన్నారు.  

ఇప్పటికే పీఆర్‌సీ కమిటీ తన సిఫార్సుల అందజేతలో  18 నెలలు జాప్యం జరిగిందని.. ఇక ఏ మాత్రం ఆలస్యం లేకుండా ప్రభుత్వానికి అందజేయాలని కోరారు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link