Ramya Krishnan Photoshoot : కొప్పున పూలు.. నిండైన చీరకట్టు.. శివగామి లుక్స్ అదుర్స్

Sat, 05 Nov 2022-5:55 pm,

నటి రమ్యకృష్ణకు బాహుబలి సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది. శివగామి పాత్రలో రమ్యకృష్ణ చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు.

రమ్యకృష్ణకు సీనియర్ హీరోయిన్‌గా ఉన్న క్రేజ్ కంటే ఇప్పుడు శివగామి పాత్రతో వచ్చిన ఇమేజ్ ఎక్కువ అయింది. ఇప్పటి తరానికి రమ్యకృష్ణ అంటే శివగామిగానే చూస్తుంటారు.

రమ్యకృష్ణ తన సెకండ్ ఇన్నింగ్స్‌ను అంత కరెక్ట్‌గా ప్లాన్ చేసుకున్నట్టుగా అనిపించడం లేదు. ఆమె ఇంత వరకు మరో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంలో నటించలేకపోయింది.

సోషల్ మీడియాలో రమ్యకృష్ణకు మాత్రం మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె తన పర్సనల్ ఫోటోలు, ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తుంటుంది. తన భర్త కృష్ణవంశీ, కొడుకు ఫోటోలను షేర్ చేస్తుంటుంది.

రమ్యకృష్ణ ప్రస్తుతం బుల్లితెర షోలు, ఓటీటీ ఫ్లాట్ ఫాం మీద షోలు చేసుకుంటూ బిజీగా ఉంటోంది. అందులో వింత వింత డ్రెస్సులు వేసుకుంటోంది. తాజాగా ఇలా కొప్పున పూలు పెట్టుకుని కనిపించింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link