మలైకా అరోరా, అర్జున్ రిలేషన్ దెబ్బకొట్టింది!

Tue, 18 Feb 2020-7:13 am,

తన భార్య, ప్రముఖ నటి శ్రీదేవి మరణం నుంచి కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నారు బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు బోనీ కపూర్. కుమార్తె జాన్వీ కపూర్ 'ధడక్' చిత్రంతో సినీ అరంగేట్రం చేశారు. తల్లికి తగ్గ కూతురు అనిపించుకునేందుకు జాన్వీ యత్నిస్తోంది. బోనీ కపూర్ తన నలుగురు పిల్లలు జాన్వీ కపూర్, ఖుషి కపూర్, అన్షులా కపూర్, అర్జున్ కపూర్ అంటే ఎంతో ప్రేమగా ఉంటారు. కానీ చిన్న కూతురు ఖుషీ అంటే బోనీకి ప్రాణం. సల్మాన్ ఖాన్‌తో తనకున్న సంబంధాన్ని ఐఎఎన్‌ఎస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బోనీ కపూర్ వెల్లడించారు.

తన కుమారుడు అర్జున్ కపూర్ ఎప్పుడూ దర్శకుడు కావాలని కోరుకుంటున్నాడని చెప్పాడు. అయితే ఆ దిశగా అర్జున్ ఎందుకు పనిచేయడం లేదో తనకు తెలియదన్నారు బోనీ కపూర్. సల్మాన్ తనను పిలిచి అర్జున్‌ను హీరో చెయాలని సూచించాడని చెప్పారు. హీరోగా ఉండటానికి అర్జున్‌కు అన్ని లక్షణాలు ఉన్నాయని సల్మాన్ చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు. (Photo Courtesy: Instagram)

అర్జున్ కపూర్‌ను కండలవీరుడు సల్మాన్ ఖాన్ చాలా మార్చేశాడు. అతిడికి మార్గనిర్దేశం చేశాడు. అతను తెరపై ఓ హీరోలా కనిపించేలా చేసింది సల్మాన్, కానీ ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. (Photo Courtesy: Instagram)

అర్జున్‌ను హీరోగా మలిచిన సల్మాన్ ఖాన్‌తో మా కుటుంబానికి మధ్య సంబంధాలు క్షీణించాయి. కానీ నా ఫ్యామిలీకి మద్దతుగా నిలిచిన సల్మాన్ అంటే నాకు ఎప్పటికీ అభిమానమేనని బోనీ కపూర్ భావోద్వేగానికి లోనయ్యారు. (Photo Courtesy: Instagram)

మలైకా అరోరాతో అర్జున్ కపూర్ చనువుగా ఉండటం, వీరి ప్రేమ వ్యవహారం సల్మాన్ ఖాన్ కు నచ్చలేదని అర్ధమైనట్లు పరోక్షంగా మాట్లాడారు. ఈ కారణంగానే సల్మాన్ ఖాన్ తమకు దూరంగా ఉంటున్నట్లు నిర్మాత బోనీ కపూర్ అభిప్రాయపడ్డారు. కాగా, సల్మాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ నుంచి విడాకులు తీసుకున్న మలైకా.. హీరో అర్జున్ కపూర్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. కుటుంబం పరువు, ప్రతిష్టలకు విలువ ఇచ్చే సల్మాన్ ఈ కారణంగానే బోనీ ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారు. (Photo Courtesy: Instagram)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link