Public Holidays: ఉద్యోగులు, విద్యార్థులకు జాక్‌పాట్‌.. 15, 12 తేదీల్లో రెండు రోజులు సెలవు

Tue, 12 Nov 2024-7:06 pm,

ఇంకా ఆ మూడ్‌లోనే: దేశవ్యాప్తంగా దీపావళి సెలవుల నుంచి ఇప్పుడిప్పుడే ఉద్యోగులు, విద్యార్థులు బయటపడుతున్నారు. ఈ సమయంలోనే మరో రెండు సెలవులు రావడం విశేషం.

రెండు రోజులు: ఈనెల నవంబర్‌ 15, 20వ తేదీల్లో రెండు సెలవులు వచ్చాయి. ఈ రెండు రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాలయాలు మూత పడనున్నాయి.

కచ్చితంగా సెలవు: ఈనెల 20వ తేదీ మాత్రం కచ్చితంగా సెలవు ప్రకటించాలని నిర్ణయించారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాలయాలతోపాటు కార్యాలయాలు కూడా మూతపడాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉల్లంఘించిన వారికి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

అసెంబ్లీ ఎన్నికలు: ఈనెల 20వ తేదీ సెలవు ఇవ్వడానికి కారణం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ఉంది. ఆ రోజు ప్రభుత్వ సెలవుగా ప్రకటించారు.

మూడు రోజులు: ఇక ఈనెల 15వ తేదీన గురు నానక్‌ జయంతి ఉంది. ఈ సందర్భంగా ఆరోజు సెలవు లభించగా.. మరుసటి రోజు శనివారం (16వ తేదీ) సగం రోజు సెలవు ప్రకటించారు. ఇక ఆ తెల్లారి ఆదివారం (17వ తేదీ) ఉండడంతో మొత్తం మూడు రోజులు సెలవులు లభించనున్నాయి.

ముంబై హెచ్చరిక: ఎన్నికల పోలింగ్‌ రోజు అన్ని వ్యాపార కేంద్రాలు, సంస్థలు, విద్యాలయాలు, మార్కెట్లు అన్ని కూడా మూసి ఉంచాలని ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఎంబీసీ) ప్రకటించింది. 

ఓటింగ్‌ కోసం: ముంబై నగరంతోపాటు పట్టణ ప్రాంతాల ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు గాను ఈ సెలవును ప్రకటించారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link