Purple Cap Winners of IPL: మ్యాచ్‌లు మలుపుతిప్పిన బౌలర్లు వీరే..

Tue, 15 Sep 2020-5:17 pm,

క్రికెట్‌లో బ్యాటింగ్‌కు అధిక ప్రాధాన్యం కనిపిస్తుంది. కానీ బౌలర్ల ప్రతిభ సైతం జట్టుకు విజయాలు అందించిన సందర్భాలు కోకొల్లలు. ఐపీఎల్ 2020 సెప్టెంబర్ 19 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో గత 12 సీజన్లో బౌలింగ్‌లో సత్తా చాటి మ్యాచ్ విన్నర్లుగా నిలిచిన పర్పుల్ క్యాప్ (Purple Cup Winners in IPL) విన్నర్ల వివరాలు మీకోసం. 

దక్షిణాఫ్రికా క్రికెటర్ ఇమ్రాన్ తాహిర్ చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గతేడాది ఐపీఎల్‌లో 17 మ్యాచ్‌లాడిన స్పిన్నర్ తాహిర్ 26 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ సాధించాడు. (Image Credits: Twitter/@ImranTahirSA)

ఆస్ట్రేలియాకు చెందిన పేసర్ ఆండ్రూ టై.. ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెన్ పంజాబ్ జట్టుకు ఆడుతున్నాడు.  2018 ఐపీఎల్ సీజన్లో 14 మ్యాచ్‌లాడిన ఆండ్రూ టై 24 వికెట్లు పడగొట్టాడు. పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. (Image Courtesy: Twitter/@aj91)

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్ 2017 సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 26 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. (Image Courtesy: Twitter/@SunRisers) 

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్ 2016 సీజన్‌లో 17 మ్యాచ్‌ల్లో 23 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. ఈ సీజన్‌లో సన్ రైజర్స్ టైటిల్ సాధించింది. (Image Courtesy: Twitter/@SunRisers) 

కరీబియన్ స్టార్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో.. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. ఐపీఎల్ 2015 సీజన్‌లో 16 మ్యాచ్‌లాడిన బ్రావో 26 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్‌ను ఒడిసిపట్టాడు. (Image Courtesy: Twitter/@CSK)

సీఎస్కే ఫాస్ట్ బౌలర్ మోహిత్ శర్మ 2014 ఐపీఎల్ సీజన్లో 16 మ్యాచ్‌లాడి 23 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అత్యధిక వికెట్లు పడగొట్టిన మోహిత్ వర్మకే పర్పుల్ క్యాప్ లభించింది. (Image Credits: Twitter/@ChennaiIPL) 

కరీబియన్ స్టార్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో.. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. ఐపీఎల్ 2015 సీజన్‌లో 15 మ్యాచ్‌లాడిన బ్రావో 24 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్‌ను ఒడిసిపట్టాడు. (Image Courtesy: Twitter/@CSK)

ఐపీఎల్ 2012 సీజన్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన పేస్ బౌలర్ మోర్నీ మోర్కెల్.. 16 మ్యాచ్‌లలో అత్యధికంగా 25 వికెట్లు తీశాడు. పర్పుల్ క్యాప్ విన్నర్ అయ్యాడు. (Image Credits: Twitter/@ICC)

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ కీలక ఆటగాడు లసిత్ మలింగ ఐపీఎల్ 2011 సీజన్‌లో 16 మ్యాచ్‌లలో 28 వికెట్లు సాధించాడు. అత్యధిక వికెట్లు తీసిన మలింగ పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. (Image Credits: Twitter/@ICC)

2010 సీజన్‌లో దక్కన్ ఛార్జర్స్ టీమ్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా పర్పుల్ క్యాప్ సాధించాడు. అప్పటి డీసీ టీమ్ బౌలర్ ఓజా.. 16 మ్యాచ్‌లలో 21 వికెట్లు తీశాడు. ఈ సీజన్‌లో దక్కన్ ఛార్జర్స్ ఐపీఎల్ విజేతగా నిలిచింది. (Image Courtesy: Twitter/@ESPNcricinfo)

2009 ఐపీఎల్ సీజన్‌లో దక్కన్ ఛార్జర్స్ ఫాస్ట్ బౌలర్ ఆర్పీ సింగ్‌కు పర్పుల్ క్యాప్ లభించింది. 16 మ్యాచ్‌లలో 23 వికెట్లు సాధించాడు. (Image Courtesy: Twitter/@rpsingh)

పాకిస్తాన్‌కు చెందిన లెఫ్టార్మ్ పేసర్ సోహైల్ తన్వీర్ ఐపీఎల్ తొలి సీజన్ 2008లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. 11 మ్యాచ్‌లలో 22 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. ఈ సీజన్‌లో షేన్ వార్న్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ జట్టు తొలి ఐపీఎల్ విజేతగా అవతరించడం తెలిసిందే. (Image Credits: Twitter/@ICC)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link