Pushpa 2 Collections: బాలీవుడ్ లో అన్ని రికార్డులు మడతేట్టేసిన పుష్ప రాజ్.. ఖాన్స్ సైతం బిత్తరపోయేలా..
Pushpa 2 Hindi Collections: తగ్గేదేలే అని ఏ సమయాన పుష్ప రాజ్ అన్నాడో.. అసలు బాక్సాఫీస్ దగ్గర పుష్ప రాజ్ దూకుడు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. అది కూడా తెలుగు ప్రేక్షకుల కంటే హిందీ ప్రేక్షకులకు పుష్ప రాజ్ తెగ నచ్చేసాడు.
అందుకే అక్కడ మొదటి రోజు నుంచే ఈ సినిమాను నెత్తిన పెట్టుకున్నారు అక్కడి ప్రేక్షకులు. తొలి రోజు నుంచి పుష్ప 2 మూవీకి వసూళ్ల వర్షం కురిపిస్తున్నారు. అక్కడ ఫస్ట్ డేనే అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. అక్కడ ఫస్ట్ డేనే రూ. 72 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది.
హిందీలో ఖాన్స్ కు కపూర్స్ కు సైతం ఈ రికార్డ్స్ చూసి బెంబేలెత్తిపోతున్నారు. మొత్తంగా అల్లు అర్జున్.. పుష్ప రాజ్ గా ఇంట గెలిచి రచ్చ గెలిచాడు. స్తున్నారు. తాజాగా అల్లు అర్జున్.. పుష్ప 2తో బాలీవుడ్ లో రికార్డుల ఊచకోత కోస్తున్నాడు.
పుష్ప 2 వసూళ్లను చూసి బాలీవుడ్ ట్రేడ్ పండితులు ముక్కున వేలేసుకుంటున్నారు. ముఖ్యంగా అక్కడ ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మారథం పడుతున్నారు. మంచి యాక్షన్ చిత్రంతో పలకరిస్తే.. ఆదరించడానికి మేము రెడీ అంటున్నారు.
అది బాహుబలి , కేజీఎఫ్ తాజాగా పుష్ప సినిమాలతో ప్రూవ్ అయింది. మొత్తంగా యాక్షన్ చిత్రాల కోసం ముఖం వాచిపోయిన హిందీ ప్రేక్షకులకు ఇపుడు దక్షిణాది యాక్షన్ చిత్రాలను గుండెల్లో పెట్టుకొని చూస్తున్నారు. పుష్ప 2కు హిందీ బెల్ట్ ఏరియల్లో ఫస్ట్ డే హిందీ వెర్షన్ మన దేశంలో రూ.72 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టి సంచలనం రేపింది. నాన్ హాలీడే రోజున ఈ రేంజ్ వసూళ్లు చూసి ఆశ్యర్యపోతున్నారు. మరోవైపు యూఎస్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా $10 మిలియన్ యూఎస్ డాలర్స్ కలెక్ట్ చేసి ఔరా అనిపించింది.
రెండో రోజు రూ. 59 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. మూడో రోజు.. రూ. 74 కోట్లు.. తాజాగా ఆదివారం నాల్గో రోజు.. చరిత్రలో కనీవినీ ఎగరని రీతిలో రూ. 86 కోట్ల రికార్డు బ్రేక్ నెట్ వసూళ్లను మన దేశంలో రాబట్టింది. మొత్తంగా నాలుగు రోజుల్లో ఈ సినిమా 9 కోట్లు తక్కువ.. రూ. 291 కోట్ల నెట్ వసూల్లతో ఫాస్టెస్ట్ రూ. 300 కోట్ల క్లబ్బులో ఈ రోజు వసూల్లతో చేరనుంది.
తాజాగా నాలుగు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 800 కోట్ల క్లబ్బులో చేరింది. ఒక రకంగా నాలుగు రోజుల్లో ఈ రేంజ్ వసూళ్లను రాబట్టి సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. మొత్తంగా కటౌట్ కు కంటెంట్ తోడైతే ఎలా ఉంటుందో ఈ సినిమా ప్రూవ్ చేసిందనే చెప్పాలి.