Allu Arjun: విడుదలకు కొన్ని గంటల ముందు మెగా ఫ్యామిలీతో చేతులు కలిపిన అల్లు అర్జున్..!

Wed, 04 Dec 2024-5:52 pm,

తాజాగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్ చేతులు కలిపినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప -2  సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రేపు ఈ సినిమా విడుదల కాబోతోంది. అనగా డిసెంబర్ 5 విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈరోజు నైట్ ప్రీమియర్ షో వేయనున్నారు. 

ఇకపోతే సినిమా విడుదల సంగతి పక్కన పెడితే, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగినప్పుడు అల్లు అర్జున్ వైసీపీ పార్టీ నేతకు సపోర్టు చేయడంతో అల్లు అర్జున్ పై మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆ సమయంలో తన మేనమామ పవన్ కళ్యాణ్ కు సపోర్టుగా  ప్రచారం చేయకుండా వైసిపి అభ్యర్థి అయిన తన ఫ్రెండ్ కి సపోర్ట్ చేయడంతో అసలు గొడవ మొదలైంది.   

ఇక అప్పుడు మెగా హీరో  సాయి ధరంతేజ్ అల్లు అర్జున్ ని అన్ ఫాలో చేశారు. దీనికి తోడు మెగా బ్రదర్ నాగబాబు కూడా అల్లు అర్జున్ పై నెగిటివ్ కామెంట్లు చేస్తూ రెచ్చిపోయిన విషయం తెలిసిందే. దీనికి తోడు గత రెండు రోజుల క్రితం నాగబాబు కూడా అల్లు అర్జున్ ను ఇన్ డైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ ఇప్పటికైనా తిరిగి రా లేకపోతే నిన్ను మళ్ళీ మాలోకి చేర్చుకోము అనే విధంగా పోస్ట్ పెట్టారు.

దీంతో మెగా అభిమానులంతా కూడా అల్లు అర్జున్ పై గుర్రుగా ఉన్నారు. ఎక్కడ కనిపిస్తే అక్కడ,  ఏది కనిపిస్తే అలా ట్రోల్స్ చేస్తూ రెచ్చిపోతున్నారు. అయితే ఇక ఏమైందో తెలియదు కానీ అల్లు అర్జున్ మాత్రం తన సినిమా విడుదలకు మెగా ఫ్యామిలీతో కలవకపోతే పూర్తి వ్యతిరేకత వస్తుందని భావించారో ఏమో తెలియదు కానీ ఇప్పుడు ఎట్టకేలకు మెగా హీరో కి స్పందించారు. 

తాజాగా తన సోషల్ మీడియా ఎక్స్ ద్వారా సాయి ధరంతేజ్ కి రిప్లై ఇచ్చారు. థాంక్యూ వెరీ మచ్ తేజు. నీ విషెస్ నాకు ఎంతో ముఖ్యమైనవి. ఈ సినిమా నీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్రేమతో హగ్గులు అంటూ పోస్ట్ చేశారు అల్లు అర్జున్. ఇకపోతే సినిమాకు విడుదలకు ముందు మెగా హీరోకి రిప్లై ఇచ్చారు అల్లు అర్జున్. దీన్ని బట్టి చూస్తే మెగా అభిమానులు కూడా ఈ సినిమా చూడాలని ఇలా ప్లాన్ చేశారా అంటూ నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా కరెక్ట్ టైం లో కొట్టాడు అని కొంతమంది కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link