Pushpa2: పుష్ప2 ప్రీమియర్స్ షోలో తొక్కిసలాట ఘటనపై కేసు నమోదు..!
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప2 సినిమా దేశవ్యాప్తంగా ఈరోజు విడుదలకు సిద్ధమవుతుంది. అన్ని రికార్డులను బద్దలు కొడుతున్న పుష్ప2 పై కేసు నమోదు చేశారు చిక్కడపల్లి పోలీసులు.
డిసెంబర్ 4 నిన్న బెనిఫిట్ షోకు ప్రేక్షకులతోపాటు తిలకించేందుకు అల్లు అర్జున్ కూడా ఫ్యామిలీతోపాటు వచ్చారు.దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్‌తో ఆర్టీసీ క్రాస్ రోడ్ అంత నిండిపోయింది. మొత్తం రచ్చ చేశారు.
ఐకానిక్ స్టార్‌ను చూసేందుకు ఒక్కసారిగా ఫ్యాన్స్ ఎగబడ్డారు. పోలీసులులు కూడ స్వల్పంగా లాఠీ ఛార్జీ కూడా చేశారు.
అయినా ఒక్కసారిగా వచ్చిన జనం వల్ల తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ చనిపోయింది. తన కొడుకు పరిస్థితి విషమించింది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ తొక్కిసలాట జరిగిన తీరుపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు కూడా నమోదు చేశారు. ఇదే ఘటనలో దామోదర్ (20), శ్రీరామ (22) కూడా గాయపడ్డారు.
గాయపడిన వారికి గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఇద్దరికీ కాళ్లకు గాయలు అయ్యాయి.వారి పరిస్థితి నిలకడగానే ఉంది.