Raai Lakshmi: ఫ్రాన్స్ వీధుల్లో అందాల ప్రదర్శన చేస్తున్న అలనాటి హీరోయిన్.. ఫోటోస్ వైరల్..!

Tue, 03 Sep 2024-11:06 am,

ఈ మధ్యకాలంలో హీరోయిన్లు ఒకవైపు వరుస సినిమాలలో నటిస్తూనే , మరొకవైపు సోషల్ మీడియా ద్వారా ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడ్డారు. ఇందులో భాగంగానే ఇక్కడ ఫాలోవర్స్ పెరిగితే,  ఆటోమేటిక్ గా క్రేజ్ పెరుగుతుందని , పైగా అవకాశాలు కూడా వస్తాయనే ఆలోచన నేటితరం సెలబ్రిటీలలో ఎక్కువైపోయింది. 

అందుకే నిత్యం ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడ్డారు.  అందులో భాగంగానే రోజుకొక గ్లామర్ ఫోటోషూట్ షేర్ చేస్తూ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. మరొకవైపు తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు ప్రొఫెషనల్ విషయాలను కూడా పంచుకుంటున్నారు. ఇక ఇప్పుడు ప్రముఖ హీరోయిన్ రాయ్ లక్ష్మీ కూడా తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేసి నా డ్రీమ్ పూర్తయింది అంటూ కామెంట్లు చేసింది. 

ఫ్రాన్స్ కి వెళ్లడం తన డ్రీమ్ అని,  అందులో భాగంగానే అక్కడికి వెళ్లి తన అందాలతో ఫ్రాన్స్ వీధుల్లో తిరుగుతూ యువతకు చెమటలు పట్టించింది ఈ ముద్దగుమ్మ. డెనిమ్ జీన్స్ అందుకు కాంబినేషన్ డెనిమ్ స్లీవ్ లెస్ టాప్ ధరించి అందాల సోయగాలతో ఉక్కిరిబిక్కిరి చేసేసింది. ఫ్రాన్స్ అందాలను ఆస్వాదిస్తూ మరొకసారి అందరినీ కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ. ఏది ఏమైనా వెకేషన్ కి వెళ్ళిన ఈమె అక్కడ తెగ చిల్ అవుతూ అభిమానులను కూడా తన అందాలతో చిల్ చేస్తోందని చెప్పవచ్చు. 

ఇక ఈమె కెరియర్ విషయానికి వస్తే కర్ణాటకలోని బెల్గాం లో. 1989 మే 5న జన్మించింది.  ఎక్కువగా తమిళ్,  మలయాళం చిత్రాలలో నటించిన ఈమె ఇండస్ట్రీ లోకి రాకముందు మోడల్ గా కెరియర్ మొదలు పెట్టింది. ఇక అందులో భాగంగానే ప్యూర్ కాఫీ, శరవణ స్టోర్స్, ఫెయిర్ అండ్ లవ్లీ వంటి బ్రాండ్ ఉత్పత్తులను ప్రమోట్ చేసింది ధామ్ ధూమ్ లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది. 

ఈమె నటించిన తెలుగు చిత్రాల విషయానికొస్తే.. కాంచనమాల కేబుల్ టీవీ,  నీకు నాకు,  అధినాయకుడు,  ఖైదీ నెంబర్ 150 , వేర్ ఇస్ ది వెంకటలక్ష్మి,  సిండ్రెల్లా, జనతా బార్ వంటి చిత్రాలలో నటించింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link