Anant-Radhika : అనంత్ అంబానీ హనీమూన్ రిసార్ట్..ఒక్కరాత్రికి ఎంతో తెలుస్తే..షాక్ అవ్వడం పక్కా..!!
Anant Ambani-Radhika Merchant : దేశంలోని వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ గత నెలలో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ముంబైలో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వేడుకగా చరిత్రలో నిలిచిపోయింది. ఈ వేడుకలకు దేశ, విదేశాల నుండి అతిథులు హాజరయ్యారు. వేల కోట్ల రూపాయలను అంబానీ కుటుంబం తమ కుమారుడి పెళ్లికోసం మంచి నీళ్ల తరహాలో ఖర్చుచేసింది.
ఈ వివాహం జరిగి నెల రోజులకు పైగా గడిచినప్పటికీ, ఇప్పటికీ దాని గురించి వార్తల్లో చర్చ జరుగుతోంది. తాజాగా అనంత్, రాధిక జంట తమ హనీమూన్ కోసం పారిస్ నుండి కోస్టారికాకు వెళ్లారు. అక్కడ వారిద్దరూ బస చేసిన రిసార్ట్‌లోని ఒక గదికి ఒక్కో రాత్రికి ఎంత అద్దె వసూలు చేస్తారో తెలిస్తే మీరు షాక్ తినడం ఖాయం. ఆ అద్దె డబ్బులతో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ జీవితాంతంగా హాయిగా బతికేస్తుంది.
ప్రపంచంలో అత్యంత ఖరీదైన, విలాసవంతమైన రిసార్ట్‌లో హనీమూన్: అనంత్, రాధిక తమ హనీమూన్ పారిస్‌లో ఎంజాయ్ చేస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న మాట అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ జంట కోస్ట్ రికాని తమ హనీమూన్ డెస్టినేషన్‌గా ఎందుకు ఎంచుకున్నారు. దీని వెనుక ఉన్న రహస్యం ఏంటనే వార్తలు ఇప్పుడు చెక్కర్లు కొడుతున్నాయి. ఇద్దరూ ఆగస్టు 1 నుంచి అక్కడే ఉంటూ ఎంజాయ్ చేస్తున్నారు.
బాలీవుడ్ లైఫ్ అనే వెబ్ సైట్ తెలిపిన సమాచారం ప్రకారం, కోస్టరికాలోని గ్వానా కాస్ట్ ప్రాంతంలో ఉన్న కాసా లాస్ ఓలాస్ ఫోర్ సీజన్స్ రిసార్ట్‌లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ బస చేస్తున్నారు. ఈ విలాసవంతమైన రిసార్ట్‌లో ఒక రాత్రి బస చేయాలంటే 30,000 డాలర్లు ఖర్చు చేయాలి..అంటే దాదాపు రూ. 25 లక్షలు ఖర్చవుతుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఈ రిసార్ట్ విలాసవంతమైన సౌకర్యాలు , అద్భుతమైన వాతావరణానికి ప్రసిద్ధి చెందింది. ఇది కాకుండా, కాసా లాస్ ఓలాస్ ప్రీటా బే సమీపంలో ఉంది, ఇక్కడ నుండి మీరు అందమైన ప్రకృతి దృశ్యాలను చూడవచ్చు. ఇది కాకుండా, రిసార్ట్ పడక గది నుండి అందమైన ప్రకృతి దృశ్యాలను చూడవచ్చు.
కోస్టరికాలోని ఈ రిసార్ట్ విశేషాలు ఇవే.. కాసా లాస్ ఓలాస్ ఫోర్ సీజన్స్ రిసార్ట్ 18,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలాన్ని కలిగి ఉన్న ఒక ప్రైవేట్ ఎస్టేట్.ఇందులో తొమ్మిది బెడ్రూమ్లు ఉన్నాయి, 100 అడుగుల స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. అలాగే ఈ రిసార్ట్ లో అత్యంత ఆధునికమైనటువంటి అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. లైవ్ మ్యూజిక్, అంతర్జాతీయ స్థాయి కళాకారుల ప్రదర్శనలు, ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరైన కోస్టారికా దేశం సెంట్రల్ అమెరికాలో ఉంది. మెక్సికో సమీపంలో ఉన్న ఈ దేశానికి రెండు మహా సముద్రాలైన ఫసిఫిక్, అట్లాంటిక్ మధ్యలో ఉంది.