Radhika Merchant:అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ ల పెళ్లి.. వైరల్ గా మారిన ప్రీవెడ్డింగ్ షూట్ పిక్స్..
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల ఎంగెజ్ మెంట్ వేడుక జనవరిలో ముంబైలో జరిగిన గోల్ ధన్ వేడుకలో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు ముకేష్ కుటుంబానికి చెందిన సన్నిహితులు, బంధువులు, అతిథులు హజరయ్యారు..
సాధారణంగా పెళ్లనగానే ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతం ప్రీవెడ్డింగ్ షూట్ లు ప్లాన్ లు చేసుకుంటున్నారు. ఇక రిలయన్స్ అధినేత ఇంట్లో పెళ్లంటే ఇక వేడులకు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
పెళ్లికి ముందు అనంత్ కు కాబోయే భార్య రాధికా మర్చంట్ ఫస్ట్ ప్రీవెడ్డింగ్ షూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాధిక మర్చంట్ లెహంగాలో ఎంతో అందంగా కన్పిస్తున్నారు. అసలే క్యూట్ గా, పాల బుగ్గలతో, ఆకర్షణీయంగా ఉంటే రాధిక ఈ కాస్టూమ్ లో మరింత అందంగా కన్పిస్తున్నారు.
గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో రాధిక మర్చంట్, అనంత్ అంబానీల ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమయ్యాయి. వధువు ఫస్ట్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. రాధిక - ఆమె 'లహగన్ లఖ్వాను' వేడుకలో ధరించడానికి సున్నితమైన లెహంగాను ధరించడానికి ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
నీతా అంబానీ, ముఖేష్ అంబానీల చిన్న కొడుకు అనంత్ అంబానీని రాధిక పెళ్లి చేసుకోబోతోంది. డిజైనర్ స్కాలోప్ ఫ్లోరల్ అప్లిక్ డిజైన్‌లకు ప్రసిద్ది చెందారు.
లెహంగా పూర్తిగా ఎంబ్రాయిడరీ చేసిన బ్లౌజ్, షీర్ ఓవర్‌లే, గోల్డెన్ ఎంబ్రాయిడరీతో మ్యాచింగ్ స్కర్ట్‌తో ఎంతో గ్రాండ్ గా కన్పిస్తుంది. ప్రస్తుతం అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల పెళ్లి విశేషాలు ఎంత గొప్పగా ఉంటాయో అని అందరు ఎదురుచూస్తున్నారు.