Rahu Transit 2024: రాహువు అరుదైన ప్రభావం.. ఈ రాశులవారికి 2025 వరకు రాజయోగమే.. సంపాదనే, సంసాదన!

Tue, 24 Sep 2024-9:49 am,

ఏ గ్రహమైన సంవత్సరంలో తప్పకుండా ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా కొన్ని గ్రహాలు చాలా లేటుగా కూడా సంచారం చేస్తాయి. అలాగే కొన్ని గ్రహాలు అప్పుడప్పుడు నక్షత్ర సంచారం కూడా చేస్తాయి. ఇదిలా ఉంటే రాహువు గ్రహం ఇప్పటికే ఉత్తర భాద్రపద నక్షత్రంలో సంచారం చేయబోతున్నాడు.  రాహువు గ్రహం డిసెంబర్‌ 2వ తేదిన సంచారం చేసి వచ్చే ఏడాది మార్చి 16వ తేది వరకు అదే నక్షత్రంలో సంచార దశలో ఉంటాడు.

రాహువు గ్రహం మార్చి 16వ తేది వరకు ఉత్తర భాద్రపద నక్షత్రంలో ఉండడం వల్ల కొన్ని రాశులవారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అలాగే ఈ సమయంలో కొన్ని రాశులవారికి కెరీర్‌ పరంగా కూడా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 

మేష రాశివారిపై ఈ సమయంలో మంచి ప్రభావం పడుతుంది. దీని కారణంగా వీరు కెరీర్‌ పరంగా ఊహించని విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా కుటుంబంలో శాంతి కూడా రెట్టింపు అవుతుంది. దీని కారణంగా సంతోషం కూడా పెరుగుతుంది.

మకర రాశివారికి రాహువు గ్రహం ఉత్తర భాద్రపద నక్షత్రంలోకి వెళ్లడం వల్ల అదృష్టం రెట్టింపు అవుతుంది. వ్యాపారాల్లో వీరు అద్భుతమైన విజయాలు కూడా సాధిస్తారు. అంతేకాకుండా విద్యార్థులకు ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. అలాగే వీరు ఎలాంటి పనులు చేసిన ఊహించని విజయాలు సాధిస్తారు. 

కుంభ రాశివారికి కూడా ఈ సమయంలో పూర్తిగా నుదుటి రాత మారబోతోంది. దీని కారణంగా వీరికి ఈ సమయంలో అనుకున్న పనులు వెంటనే జరుగుతాయి. అలాగే దాంపత్య జీవితంలో వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి. దీంతో పాటు ఆర్థిక పరిస్థితులు కూడా ఎంతో అనుకూలంగా ఉంటాయి.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link