Rain Alert: నేడే తుఫాను.. మూడు రోజులు భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలెర్ట్..
గత కొన్ని రోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనాల వల్ల తీరప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే, తాజాగా 'ఫెంగల్' తుఫాను వల్ల మూడు రోజులు వర్షాలు కురుస్తాయన ఐఎండీ హెచ్చరించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం నేడు తుఫానుగా మారనుంది. దీంతో ఈరోజు నుంచి మూడు రోజులపాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈ తుఫాను వల్ల ముఖ్యంగా రాయలసీమపై ప్రభావం పడుతుందని అంచనా. ఇప్పటికే రైతులను అలెర్ట్ చేసిన ఐఎండీ, మత్స్యకారులను కూడా వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేసింది.
ఇప్పటికే తమిళనాడులోని చెన్నైలో ఈ తుఫాను వల్ల ఆరెంజ్ అలెర్ట్ కూడా జారీ చేశారుచ ముఖ్యంగా తిరువళ్లూర్, కాంచీపురం, చెంగల్పట్టు, కడలూర్, తంజావూరు ప్రాంతాలను అలెర్ట్ చేశారు.
ఇండిగో కూడా తమ ప్రయాణీకులకు ప్రయాణ సూచనలు చేసింది. ఫ్లైట్స్ రీషెడ్యూల్ వివరాలను తెలిపింది. తమిళనాడులోని పుదుచ్చేరి, కరైకల్ పరిసర ప్రాంతాల్లో వరదలు విజృంభించవచ్చని ఐఎండీ హెచ్చరించింది.