Rakshabandhan Gift Ideas: రాఖీ వచ్చేస్తోంది, మీ సోదరికి ఏ గిఫ్ట్ ఇవ్వాలో తెలియడం లేదా, 5 బెస్ట్ గిఫ్ట్ ఐడియాలు

Sat, 26 Aug 2023-9:39 pm,

స్మార్ట్ వాచ్

ఇటీవలి కాలంలో స్మార్ట్ వాచ్ ఉపయోగం ఎక్కువగా కన్పిస్తోంది. అందుకే రాఖీ నాడు మీ సోదరికి మంచి బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ ఇస్తే బాగుంటుంది. కచ్చితంగా మీ సోదరికి నచ్చే బహుమతి ఇది.

మేకప్ కిట్

ఇక అమ్మాయిలు అమితంగా ఇష్టపడే మరో బహుమతి మేకప్ కిట్. ఈ బహుమతి ఇష్టపడని అమ్మాయిలుండరు. అందుకే మంచి బ్రాండెడ్ మేకప్ కిట్ రాఖీ నాడు బహుమతిగా ఇస్తే బాగుంటుంది. 

జ్యువెల్లరీ

అమ్మాయిలకు నగలు ధరించడం అంటే చాలా చాలా ఇష్టం. నగలు బహుమతిగా ఇస్తే మీ సోదరి చాలా ఇష్టపడుతుంది. గోల్డ్ లేదా డైమండ్ సెట్ కూడా బహుమతిగా ఇవ్వవచ్చు. 

డ్రెస్ బహుమతి

మీ సోదరి మీ కంటే పెద్దదైనప్పుడు ప్రేమగా మంచి సల్వార్ సూట్ లేదా చీర బహుమతిగా ఇవ్వవచ్చు. పెళ్లైనవారికైతే ఈ బహుమతి మరింత నచ్చుతుంది. సోదరి మీ కంటే చినదైతే అందమైన డ్రెస్ కొనివ్వచ్చు.

బ్రేస్ లెట్

రక్షాబంధన్ రోజున మీ సోదరికి అందమైన బ్రేస్ లెట్ బహుమతిగా ఇవ్వవచ్చు. ఎందుకంటే అమ్మాయిలు బ్రేస్ లెట్ చాలా ఇష్టపడతారు. ఇది ఆమె రోజూ ఉపయోగించే గిఫ్ట్ అవుతుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link