Rakul Preet Singh: రకుల్ బెడ్ రెస్ట్ కే పరిమితం కానుందా.. అసలేం జరిగిందంటే..?

Sat, 19 Oct 2024-8:37 am,

టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ పాపులారిటీ సొంతం చేసుకొని ఎన్టీఆర్ , అల్లు అర్జున్, నాగార్జున, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించి, స్టార్ హీరోయిన్ అనిపించుకున్న రకుల్ మంచి ఫిట్నెస్ ఫ్రీక్ కూడా.   

అయితే ఈమెకు తీవ్ర గాయం కావడంతో ఆసుపత్రి పాలైనట్లు,  బెడ్ రెస్ట్ కే పరిమితం కాబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. 

ప్రతిరోజు జిమ్ లో వర్క్ అవుట్ చేయనిదే రోజు గడవని రకుల్ ప్రీత్ సింగ్.. నడుముకి బెల్ట్ లేకుండా ఏకంగా 80 కేజీల వెయిట్  లిఫ్ట్ చేసింది. ఆ సమయంలో వెన్నెముకకు కాస్త గాయం అయిందట. 

వైద్యులు ఆమెను పరిశీలించి కొన్ని వారాలు బెడ్ రెస్ట్ తీసుకోమని సూచించారు. కానీ కాస్త కుదుటపడడంతో వెంటనే దేదే ప్యార్ దే -2 సినిమా షూటింగ్లో నొప్పి భరిస్తూనే పాల్గొనింది. ఆ ప్రభావం మళ్లీ వెన్నుపూసపై పడిందట. ఇటీవలే తన పుట్టినరోజు నాడు సెలబ్రేషన్స్లో పాల్గొనాల్సి ఉండగా.. గంటముందు ఎల్ ఫోర్, ఎల్ ఫైవ్ అలాగే ఎస్1 సమీపంలోని.. నరాలపై ఒత్తిడి కారణంగా అవి జామ్ అయ్యాయని సమాచారం. 

దాంతో కుటుంబ సభ్యులు ప్రథమ చికిత్స జరిపించి వైద్యులను పిలిపించగా.. వారు కండరాల సడలింపుకు ఇంజక్షన్లు చేశారట. ఇక ప్రస్తుతం ఆమెను కొన్ని వారాలపాటు బెడ్ రెస్ట్ తీసుకోమని సూచించినట్లు సమాచారం. ఈ విషయం తెలిసి అభిమానులు కలవరపాటుకు గురి అవుతున్నారు.ఏది ఏమైనా రకుల్ ప్రీత్ సింగ్ కి వ్యాయామలే.. ప్రాణహానిగా మారడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link