Game Changer Review: గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ .. గూస్ బంప్స్ గ్యారెంటీ అంటూ.!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చాలా రోజుల తర్వాత సోలో హీరోగా చేస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ ఎస్.శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన విడుదల కాబోతోంది. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ను అమెరికాలోని డల్లాస్ లో చాలా ఘనంగా నిర్వహించారు మేకర్స్.
అందులో భాగంగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సుకుమార్. ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్ప 2 సినిమా చేసి భారీ విజయాన్ని అందుకున్న సుకుమార్ జోరు మీద ఉన్నారు. ఈ నేపథ్యంలోని ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా విచ్చేశారు . అనంతరం స్టేజ్ పైన మాట్లాడుతూ ఈ సినిమా గురించి వెల్లడించారు. ముఖ్యంగా గేమ్ ఛేంజర్ సినిమా గురించి సుకుమార్ చేసిన కామెంట్లు, ఇచ్చిన ఫస్ట్ రివ్యూ అభిమానులలో గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.
సుకుమార్ మాట్లాడుతూ.. చిరంజీవి గారితో కలిసి నేను కూడా గేమ్ ఛేంజర్ సినిమా చూశాను. ఈ సినిమాని ఆల్రెడీ చూశాను కాబట్టి ఫస్ట్ రివ్యూ కూడా నేనే ఇస్తాను. ఈ సినిమా అద్భుతంగా వచ్చింది. ముఖ్యంగా మొదటి భాగం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఇంటర్వెల్ బ్లాక్ బాస్టర్. సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది ఫినామినల్ అంటూ రివ్యూ ఇచ్చుకుంటూ వెళ్ళాడు. సుకుమార్ ఇచ్చిన గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇకపోతే శంకర్ తీసిన జెంటిల్మెన్, భారతీయుడు చిత్రాలను ఎంతగా ఎంజాయ్ చేశాడో.. మళ్లీ ఈ సినిమా చూసి అంతే ఎంజాయ్ చేశాడట సుకుమార్. రంగస్థలం తర్వాత రామ్ చరణ్ కి జాతీయ అవార్డు వస్తుందని భావించారట. కానీ అప్పుడు రాలేదని ఇప్పుడు మాత్రం అసలు మిస్ అవ్వదని క్లైమాక్స్ లో రాంచరణ్ నటనకు జాతి అవార్డు కచ్చితంగా వస్తుందని తన అభిప్రాయంగా చెప్పుకొచ్చారు.
ఇకపోతే సుకుమార్ చెప్పినట్టు రామ్ చరణ్ కు జాతీయ అవార్డు వస్తుందో లేదో తెలియదు కానీ ఈ సినిమా హిట్ అయితే మాత్రం ఆయనకు అభిమానుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది అని చెప్పవచ్చు.