Amy Jackson Bikini Stills : అమీ.. ఏమీ అందమిది.. బికినీలో రామ్ చరణ్ హీరోయిన్ సందడి

Sat, 29 Oct 2022-1:37 pm,

అమీ జాక్సన్ అంటే అందరికీ శంకర్ సినిమాలే గుర్తుకు వస్తాయి. విక్రమ్ నటించిన ఐ సినిమాతో అందరినీ మెప్పించింది అమీ జాక్సన్. అయితే ఆ చిత్రం అంతగా ఆడలేదు.

శంకర్ సినిమాలో హీరోయిన్ అంటే అందరూ ప్రత్యేకంగా చూస్తుంటారు. అలా ఐ సినిమాతో అమీ జాక్సన్‌కు హిట్ రాకపోవడంతో.. మళ్లీ రోబో 2.ఓ సినిమాకు చాన్స్ ఇచ్చాడు. 

అమీ జాక్సన్ తరువాత రామ్ చరణ్, ధనుష్ వంటి వారి సరసన నటించింది. అయితే సినిమాల్లో అమీ జాక్సన్‌కు అంతగా గుర్తింపు రాలేదు. విదేశీ భామ అందాలకు అందరూ ఫిదా అయ్యారు గానీ.. అదృష్టం మాత్రం కలిసి రాలేదు.

అమీ జాక్సన్ ప్రస్తుతం ఓ బిడ్డను కనేసింది. అలా అని పెళ్లి చేసుకోలేదు. డేటింగ్‌ చేస్తుండగానే అమీ జాక్సన్ ఇలా బిడ్డను కనేసింది. ఆ మధ్య అమీ జాక్సన్‌కు తన ప్రియుడికి బ్రేకప్ జరిగిందనే రూమర్లు వచ్చాయి.

అమీ జాక్సన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో కాక రేపుతోంది. అందాల ప్రదర్శనతో బికినీలో కనువిందు చేస్తూ నెటిజన్లకు కునుకు లేకుండా చేసేస్తోంది. అమీ జాక్సన్ బికినీ పోజులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link