Ramanujacharya 1000 Years Pics: మరణించి 1000 ఏళ్లు అయినా.. రామానుజాచార్యుల శరీరం ఇంకా అక్కడ ఉంది.. ఏంటి నమ్మట్లేదా?
చరిత్రకారులు తెలిపిన వివరాల ప్రకారం రామానుజాచార్యులు క్రీస్తు శకం 1037 సంవత్సరాల మధ్య జన్మించారని.. ఇప్పటినుంచి ఆయన జీవితం ప్రారంభమైందని సమాచారం. ఇక సాంప్రదాయ ఆధారాల పరంగా చూస్తే ఆయన తమిళ సంవత్సరంలో జన్మించారట. ఆయన జీవితకాలం మొత్తం 160 సంవత్సరాలు ఉంటుందని చరిత్ర చెబుతోంది.
అయితే చరిత్రలో లిఖించిన వివరాల ప్రకారం.. తమిళ కాలమానం అంటే ఒకే పేరు గల సంవత్సరం రావడానికి దాదాపు 60 సంవత్సరాల టైం పడుతుందట. అంటే రామానుజాచార్యుల జీవితం 60 లేక 120 సంవత్సరాలు ఉండవచ్చునని మనం భావించవచ్చు. సాధారణంగా ఒక వ్యక్తి మరణించిన మూడు రోజులకే శరీరం కుళ్ళిపోతుంది.
కానీ శ్రీరామానుజాచార్యుల శరీరం మాత్రం ఇప్పటికీ అనేక కాంతులతో విరాజిల్లుతూ కనిపిస్తోంది. ఇలాంటి అద్భుత దృశ్యాలను చూడాలనుకునే వారు తప్పకుండా తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన శ్రీరంగం క్షేత్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. ఇక్కడే ఆయన శరీరం ఉందని సమాచారం..
ప్రస్తుతం శ్రీరంగం వెళ్లే భక్తులు చాలా మంది శ్రీరంగంలోని 4వ ప్రాకారులు ఉన్న రామానుజాచార్యుల దేవాలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. అయితే అందులో ఉండే విగ్రహం ఆయన శరీరమేనని పురాణాలు చెబుతున్నాయి. ఆయన ఇక్కడ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు యోగ భంగిమలో కూర్చున్నట్లు తెలుస్తోంది.
ప్రతి సంవత్సరం తమిళనాడు ప్రభుత్వం శ్రీరంగంలో ప్రతి ఏటా ఉత్సవాలు నిర్వహిస్తారు. అయితే ఈ సమయంలో ఆయన శరీరానికి కుంకుమ పువ్వుతో పాటు కర్పూరంతో తయారుచేసిన ఓ మిశ్రమాన్ని పూస్తారట. దీనివల్ల శరీరం ఎర్రని వర్ణంలోకి మారిందని సమాచారం..