Secunderabad Bonalu 2024: రంగం భవిష్యవాణి స్వర్ణలత ఎవరు? ఏం చేస్తుంటారు? ఎవరికీ తెలియని నిజాలు..

Mon, 22 Jul 2024-8:49 am,

అయితే, మీకు రంగంరోజు భవిష్యవాణి చెప్పే మాతంగి స్వర్ణలత గురించి మీకు ఏమైనా తెలుసా? అసలు ఈమె ఎవరు? సాధారణంగా ఆమె ఏం చేస్తుంటారు. ఆ వివరాలు తెలుసుకుందాం.  

ప్రతిఏడాది లష్కర్‌ బోనాల్లో భవిష్యవాణి గురించి ప్రతి ఏడాది ఎదురు చూస్తుంటారు. పచ్చికుండపై నిలబడి మాతంగి స్వర్ణలత భవిష్యవాణిని వినిపిస్తారు. మాతంగిని సరస్వతి మాతతో పోలుస్తారు.   

స్వర్ణలత ఎరుపుల నర్సింహ్మా, ఇస్తారమ్మ దంపతులకు జన్మించారు. నర్సింహ్మ అమ్మవారి గుడివద్ద పంబజోడి వాయించేవారు. ఆమె తల్లి కూడా భర్తకు తోడుగా జేగంట మోగించేవారు. స్వర్ణలతకు చిన్నతనంలోనే ముత్యాలమ్మ గుడిలో కత్తితో పెళ్లి చేయించారు.  

ఆ తర్వాత మాతంగి స్వర్ణలత జీవితం మహంకాళీ అమ్మ సేవకే అంకితం అయింది. ఈమె పదవ తరగతి వరకు చదువుకున్నారు. ఆ తర్వాత భవిష్యవాణి వినిపించడం మొదలు పెట్టారు. వారి కుటుంబంలోని ఆడపిల్లలు అమ్మవారికే అంకితం. ఈమె తల్లిదండ్రులు చనిపోయారు 1996 వరకు అక్క స్వరూపారాణి భవిష్యవాణి చెప్పేవారు ఆమె చనిపోయిన తర్వాత స్వర్ణలత వంతు వచ్చింది.  

స్వర్ణలత ఆమె తమ్ముడితోపాటు ఉంటున్నారు. సాధారణ టైలర్‌ గా జీవిస్తున్నారు. బోనాల సమయంలో కేవలం రాత్రి సమయంలో పాలు మాత్రమే తాగుతారట. బోనాల మరుసటి రోజు ముఖం నిండా పసుపు, పెద్దకుంకుమ తిలకం, ముక్కుకు ముక్కెర, చేతిలో కిన్నెర, మెడలో దండలతో భవిష్యవాణి వినిపిస్తారు స్వర్ణలత  

అమ్మవారిలో గుడిలోకి ప్రవేశించి పచ్చికుండపై నిలబడి భవిష్యవాణి వినిపిస్తారు. సాధారణంగా మాములు కుండపై నిలబడితేనే పగిలిపోతుంది. అలాంటిది పచ్చికుండపై నిలబడి అంతసేపు పూజరి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతుంది. ఆ సమయంలో ఏం జరుగుతుందో కూడా ఆమెకు తెలియదట.  

గత 25 ఏళ్లుగా ఈమె రంగం వినిపిస్తున్నారు. అంతకు ముందు స్వర్ణలత వారి పూర్వీకులు ఈ భవిష్యవాణి వినిపించేవారట. ఇది తరతరాలుగా వస్తోంది. అమ్మవారిని తలచుకుని పచ్చికుండపై నిలబడి ఈ దేశభవిష్యత్తు గురించిన భవిష్యత్తు చెబుతారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link