Rashmika Mandanna Remuneration: రష్మిక మొదటి రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Fri, 05 Apr 2024-8:17 pm,

1996 ఏప్రిల్ 5న జన్మించింది రష్మిక మందన్న. నేటితో 28 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ హీరోయిన్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తొమ్మిది సంవత్సరాలు కావస్తోంది.

రష్మిక కర్ణాటకకు చెందిన అమ్మాయి.. చిన్నప్పుడు తన చదువు అంతా కర్ణాటకలోనే జరిగింది. ఆ తరువాత సినిమాల పైన ఇంట్రెస్ట్ తో మోడలింగ్ వైపు తన దృష్టి మళ్లించింది రష్మిక..

ఒక షోలో ఆమెను చూసిన రక్షిత్‌ శెట్టి.. అతని సినిమా ‘కిరిక్‌ పార్టీ’ కోసం ఎలాంటి ఆడిషన్‌ లేకుండానే ఛాన్స్‌ ఇచ్చాడు.. కాగా ఆ సినిమాకి కానీ రష్మిక తన మొదటి రెమ్యూనరేషన్ తీసుకునింది.

అయితే ఈ హీరోయిన్ తీసుకున్న ఫస్ట్ రెమ్యూనరేషన్ గురించి చాలా మందికి తెలియదు.. కిర్రాక్ పార్టీ సినిమాకు ఆమెకు 1,50,000 రెమ్యునరేషన్ గా ఇచ్చారట. 

ఇక ఆ చిత్రం విడుదలై విజయం సాధించడంతో ఎన్నో అవకాశాలు అందుకుంటూ వచ్చింది రష్మిక. ఇక ఆ తర్వాత ఈ హీరోయిన్ తెలుగులో నాగశౌర్యతో చేసిన ఛలో సినిమాకు రూ. 50 లక్షలు అందుకున్నారని టాక్‌.. కొలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు అక్కడ కూడా స్టార్ హీరోలతో నటించింది…

ప్రస్తుతం రష్మిక ఒక్కో చిత్రానికి 5 నుంచి 7 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటుందని తెలుస్తుంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ అందుకున్న రష్మిక ప్రస్తుతం తెలుగు పుష్ప 2 సినిమాతో పాటుగా రెండు సినిమాల్లో నటిస్తుంది.. బాలీవుడ్ లో కూడా ఈ హీరోయిన్ కి వరస అవకాశాలు వస్తున్నాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link