Rashmika Mandanna: హాట్ హాట్ గా రష్మిక మందన్న అందాల రచ్చ.. శ్రీవల్లి అందానికి షేక్ అవుతున్న సోషల్ మీడియా..

Fri, 20 Sep 2024-3:07 pm,

ర‌ష్మిక మంద‌న్న‌ మన దేశంలో అస‌లు సిస‌లు  ప్యాన్ ఇండియా హీరోయిన్‌గా  సత్తా చూపెడుతోంది. లాస్ట్ ఇయర్ ‘యానిమ‌ల్’ మూవీతో ఈమె క్రేజ్ అమాంతం  పెరిగింది. తాజాగా స‌ల్మాన్ ఖాన్, మురగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సికింద‌ర్ మూవీలో హీరోయిన్ గా న‌టిస్తోంది.

ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. రష్మిక ఇంట సౌత్ సినీ ఇండ‌స్ట్రీలో  విజ‌యాలు అందుకుంటూనే బాలీవుడ్‌లో రచ్చ  చేస్తోంది. ఈమె వివిధ భాషల్లో నటించిన అన్ని చిత్రాలు బ్లాక్ బస్టర్స్ అందుకోవడం విశేషం. ఈ రేంజ్‌లో అన్ని భాషల్లో హీరోయిన్‌గా  ఈ మధ్య కాలంలో ర‌ష్మిక మిన‌హా ఎవరు లేరు.

లాస్ట్ ఇయర్ మొదట్లో 'మిషన్ మజ్ను', యేడాది చివర్లో  'యానిమిల్' మూవీస్‌తో ప్యాన్ భారత్ లెవల్లో సత్తా చాటింది. దీంతో రష్మిక పేరు మారు మోగిపోయింది.

రష్మిక మందన్న 2020లోనే నేషనల్ క్రష్‌గా ఎంపికై సంచలనం రేపింది. బాలీవుడ్లో బిగ్‌బీతో కలిసి గుడ్ బై మూవీ తొలిసారి హిందీ చిత్ర పరిశ్రమలో ప్రవేశించింది. త్వరలో పుష్ప - ది రూల్ మూవీతో పలకరించబోతుంది.ఈ మూవీ  డిసెంబర్ 6కున విడుదల కాబోతుంది.

రష్మిక మందన్న శాండిల్ వుడ్ నుంచి టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ కూడా సత్తా చాటుతోంది. అన్ని ఇండస్ట్రీస్‌లో  జెట్ స్పీడ్‌లో దూసుకుపోతుంది.

తాజాగా  అటు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీలో ఈ కన్నడ కస్తూరినే ఫిక్స్ చేసినట్టు సమాచారం.  ఇటు ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతోన్న 'స్పిరిట్‌' మూవీలో రష్మికనే హీరోయిన్ గా ఫైనలిజ్ అయినట్టు సమాచారం. త్వరలో అధికారిక ప్రకటన వెలుబడనుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link