Rashmika Mandanna: సీతాకోకచిలుకలా రష్మిక…ఎప్పుడూ లేనంత స్టైలిష్ గా!
నేషనల్ క్రష్ రష్మిక పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఆ తరువాత నుంచి హిందీ ఇండస్ట్రీలో సైతం ఎన్నో అవకాశాలు తెచ్చుకుంటోంది.
ముఖ్యంగా గత సంవత్సరం చివరిలో.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రష్మిక నటించిన యానిమల్ సినిమా ఆమెకు మంచి విజయాన్ని అందించింది. రణబీర్ కపూర్ తో చేసిన ఈ సినిమాలో.. గీతాంజలి క్యారెక్టర్ లో కనిపించింది ఈ హీరోయిన్.
కాగా ప్రస్తుతం రష్మిక పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉంది. ఈ చిత్రమే కాకుండా.. ఇంకా రెండు మూడు సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది ఈ నటి.
సినిమాల విషయం పక్కన పెడితే.. విజయ్ దేవరకొండ తో తన ప్రేమ విషయం వల్ల కూడా తరచు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది రష్మిక. ఈ మధ్య విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ సినిమాని సైతం చాలా ప్రమోట్ చేసింది.
కాగా ప్రస్తుతం రష్మిక ఇంస్టాగ్రామ్ ఫోటోలు వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోలలో క్రీం డ్రెస్ వేసుకున్న సీతాకోకచిలకలా ఎంతో అందంగా కనిపించింది ఈ హీరోయిన్.