Rashmika Mandanna: ఎంతో పద్ధతిగా రష్మిక.. చూస్తే ప్రేమలో పడాల్సిందే!

Sat, 13 Jul 2024-4:00 pm,

ప్రస్తుతం పాన్ ఇండియా పరంగా స్టార్ హీరోయిన్.. ఎవరు అంటే..వెంటనే గుర్తొచ్చే పేరు రష్మిక మందన్నా. పుష్ప సినిమా తర్వాత.. పాన్ ఇండియన్ పరంగా..స్టార్ స్టేటస్ అందుకున్న ఈ హీరోయిన్ యానిమల్..సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.

ఇక అప్పటినుంచి.. రష్మికకి సౌత్ ఇండియాలోనే కాకుండా.. నార్త్ ఇండియాలో కూడా క్రేజ్ పెరిగిపోయింది. ఈ నేషనల్ క్రష్ కి ..ప్రస్తుతం భాషతో సంబంధం.. లేకుండా వరస ఆఫర్లు వస్తున్నాయి 

ఇప్పటికే రష్మిక.. చేతిలో దాదాపు అర డజన్ సినిమాలో ఉన్నాయి. అందులో ఒకటి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వస్తున్న.. గర్ల్ ఫ్రెండ్ కాగా ..మరొకటి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రానున్న.. కుబేర . ఈ చిత్రంలో ధనుష్,‌నాగార్జున హీరోలుగా నటిస్తున్నారు.

ఇక ఈ రెండు సినిమాలు కాకుండా పుష్ప 2.. సినిమాతో ఈ సంవత్సరం డిసెంబర్ లో వచ్చి ప్రేక్షకులను అల్లరించనుంది.. ఇక సల్మాన్ ఖాన్ తో సైతం సికిందర్ అనే చిత్రంలో కనిపించనుంది. మరోపక్క యానిమల్ పార్క్ సినిమాని.. కూడా సందీప్ రెడ్డి త్వరలోనే మొదలుపెట్టగా.. ఆ చిత్రంలో కూడా రష్మిక హీరోయిన్గా కనిపించనుంది.

ఇలా అన్ని భాషలలోని వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది.. ఈ హీరోయిన్. కాగా ప్రస్తుతం ఈ హీరోయిన్ షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link