Rashmika Mandanna: పచ్చ డ్రెస్ లో మెరిసిపోయిన రష్మిక.. అదిరిపోయింది అంటున్న ఫ్యాన్స్

Fri, 26 Apr 2024-3:33 pm,

పుష్ప సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకునేది రష్మిక. అయితే ఈ సినిమా కన్నా ముందే రష్మికాకు తెలుగులో ఎంతో క్రేజ్ ఉంది. ముఖ్యంగా ఈ హీరోయిన్ చేసిన గీతాగోవిందం చిత్రం తెలుగులో మంచి విజయం సాధించి ఆమెకు ఎంతో పేరు తెచ్చి పెట్టింది.

విజయ్ దేవరకొండ తో చేసిన గీతాగోవిందం సినిమాతో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన రష్మిక. ఆ తరువాత నుంచి తెలుగులో వరస అవకాశాలు అందుకుంటు దూసుకుపోయింది.

కిరిక్ పార్టీ అనే కన్నడ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రష్మికాకు తెలుగు భాషలోనే అభిమానులు ఎక్కువ. అయితే ప్రస్తుతం అన్ని భాషలలో కూడా ఈమెకు ఆఫర్ల పైన ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.

ఈ మధ్యనే తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ హిందీలో తీసిన యానిమల్ చిత్రంతో మరో పాన్ ఇండియా సూపర్ హిట్ అందుకుంది ఈ నటి. ప్రస్తుతం తనకు ఎంతో విజయం అందించిన పుష్ప సినిమా సీక్వెల్ పుష్ప 2 చిత్రంతో బిజీగా ఉంది.

ఈ క్రమంలో ఎంతో అందమైన గ్రీన్ డ్రెస్సులో రష్మిక షేర్ చేసిన ఇంస్టాగ్రామ్ ఫోటోలు వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link