Rashmika Mandanna: చీరలో రష్మికా మందన్న.. చెక్కిన శిల్పంలా అందాలు..

Mon, 11 Mar 2024-1:16 pm,

కిరిక్ పార్టి అనే కన్నడ సినిమా ద్వారా సినీ రంగానికి అడుగుపెట్టిన హీరోయిన్ రష్మికా మందన్న. నాగశౌర్య హీరోగా చేసిన ఛలో అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సైతం పరిచయమైంది.

మొదటి సినిమాతోనే మంచి విజయం సాధించిన ఈ నటి గీతాగోవిందం చిత్రంతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. విజయ దేవరకొండ తో చేసిన ఈ సినిమా ఆమెకి ఎన్నో ఆఫర్లు తెచ్చిపెట్టింది.  

అక్కడి నుంచి దాదాపు అందరూ స్టార్ హీరోలతో జోడి కట్టింది ఈ హీరోయిన్. ఇక ఈమధ్య అల్లు అర్జున్ తో చేసిన పుష్ప సినిమా ఆమెను ఏకంగా పాన్ ఇండియా స్టార్ చేసేసింది.

ఆ తరువాత సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో రష్మిక చేసిన యానిమల్ సినిమా కూడా సూపర్ సక్సెస్ సాధించి ఆమెకు సౌత్ సైడ్ తో పాటు నార్త్ సైడ్ కూడా ఎంతోమంది అభిమానులను తెచ్చిపెట్టింది.

ప్రస్తుతం పుష్ప చిత్రం సీక్వెల్ అలానే యానిమల్ సినిమా సీక్వెల్ ఆఫర్లతో పాటు మరికొన్ని సినిమా చాన్సులతో దూసుకుపోతోంది రష్మిక. ఈ నేపథ్యంలో ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ లో చీరలో షేర్ చేసే ఫోటోలు కొన్ని వైరల్ అవుతున్నాయి. చెక్కిన శిల్పంలా ఈ ఫోటోలలో ఎంతో అందంగా కనిపిస్తూ మైమరిపిస్తుంది ఈ హీరోయిన్.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link