Success Lessons From Ratan Tata: సొంత కంపెనీలో చేరడానికి రతన్ టాటా పడ్డ కష్టం.. ఆశ్చర్యం కలిగించే నిజాలు!
ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా అక్టోబర్ 9 ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాసను విడిచారు.
రతన్ టాటా 1991 నుంచి 2012 వరకు టాటా సన్స్ చైర్మన్‌గా పనిచేశారు. ఆయన నాయకత్వంలో టాటా గ్రూప్ విస్తారంగా విస్తరించి, ప్రపంచ స్థాయి సంస్థగా ఎదిగింది.
అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాలలో ఒకటిగా గుర్తింపబడిన రతన్ టాటా ఆయన కెరీర్‌ను ఒక సాధారణ ఉద్యోగిగా ప్రారంభిస్తారని చాలా మందికి తెలియని విషయం.
అమెరికాలో రతన్ టాటా గారు ఆర్కిటెక్చర్ స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ లో చదువు పూర్తి చేశారు. ఆ సమయంలో తన అమ్మమ్మ లేడీ నవాజ్‌బాయి ఆరోగ్యం క్షీణించడంతో భారతదేశానికి తిరిగి వచ్చారు.
భారతదేశానికి తిరిగి వచ్చిన రతన్ టాటాకు అంతర్జాతీయ కంపెనీ అయిన ఐబీఎంలో ఉద్యోగం లభించింది. ఈ విషయం తెలిసిన రతన్ టాటా బంధువు జేఆర్‌డీ టాటాకు ఆ కంపెనీలో పని చేయడం నచ్చలేదని చెప్పినట్లు సమాచారం.
రతన్ టాటా భారతదేశంలో ఉంటూ, ఐబీఎంలోనే ఎందుకు ఉద్యోగం చేయాలనుకుంటున్నాడని జేఆర్‌డీ టాటా ఆయనను ప్రశ్నించారని సమాచారం.
ఈ కారణంగా రతన్ టాటా తన రెజ్యూమ్‌ను జేఆర్‌డీ టాటాకు అందజేయాల్సి వచ్చింది. ఆ సమయంలో రతన్ టాటా వద్ద రెజ్యూమ్ లేదు. ఆయన పనిచేస్తున్న ఐబీఎం కార్యాలయంలోని ఎలక్ట్రిక్ టైప్‌రైటర్ సాయంతో రెజ్యూమ్‌ను తయారు చేశారు.
1962లో మొదటి ఉద్యోగం రెజ్యూమెను అందించిన తర్వాత రతన్ టాటాకు టాటా ఇండస్ట్రీస్‌లో ఉద్యోగం వచ్చింది.
దాదాపు మూడు దశాబ్దాల ఉద్యోగ జీవితం తర్వాత 1991లో జేఆర్‌డీ టాటా మరణానంతరం రతన్ టాటా టాటా గ్రూప్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.
రతన్ టాటా జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సంది కష్టపడటం,అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం, నాయకత్వ లక్షణాలకు నిదర్శనం.