Bank Holidays October 2024: అక్టోబర్‌లో అన్నీ సెలవులే, 15 రోజులు మూతపడనున్న బ్యాంకులు
మీకు వచ్చే నెల అక్టోబర్ లో బ్యాంకు పనులుంటే ఇక్కడిచ్చిన సెలవుల జాబితా చెక్ చేసుకుని ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే అక్టోబర్ నెలలో బ్యాంకులకు ఏకంగా 15 రోజులు సెలవున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్టోబర్ నెల బ్యాంకు సెలవుల జాబితా విడుదల చేసింది. వీటిలో రెండు, నాలుగు శనివారాలు, నాలుగు ఆదివారాలతో పాటు పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయి.
ముఖ్యంగా అక్టోబర్ నెలలో గాంధీ జయంతి నుంచి మొదలుకుని విజయ దశమి, దీపావళి, దుర్గా పూజ వంటి సెలవులున్నాయి. మొత్తం 31 రోజుల్లో బ్యాంకులు 15 రోజులే పనిచేయనున్నాయి. అయితే కొన్ని సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారుతుంటాయి. ఏ రాష్ట్రంలో ఎప్పుడు సెలవులున్నాయో చెక్ చేసుకుని అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు.
అక్టోబర్ 1 జమ్ము కాశ్మీర్‌లో ఎన్నికల సందర్భంగా ఆ రోజు ఆ రాష్ట్రంలో బ్యాంకులు పనిచేయవు. అక్టోబర్ 2 గాంధీ జయంతి దేశమంతా సెలవు ఉంది. ఇక అక్టోబర్ 3 నవరాత్రులు ప్రారంభం సందర్భంగా జైపూర్‌లో బ్యాంకులకు సెలవు అక్టోబర్ 6న ఆదివారం దేశమంతా బ్యాంకులకు సెలవు
ఇక అక్టోబర్ 10 దుర్గా పూజ, దసరా పురస్కరించుకుని గౌహతి, అగర్తల, కోహిమ, కోల్‌కతాలో బ్యాంకులకు సెలవు. అక్టోబర్ 11న బెంగళూరు, భువనేశ్వర్, తమిళనాడు, గౌహతి, ఇంఫాల్, గ్యాంగ్‌టక్, ఈటానగర్, అగర్తల, కోహిమ, కోల్‌కతా , పాట్నా, రాంచి,లో దసరా, మహా నవమి సెలవు. అక్టోబర్ 12న విజయ దశమి సందర్భంగా దేశమంతా సెలవు ఉంది. అక్టోబర్ 13 ఆదివారం దేశమంతా సెలవు. అక్టోబర్ 14 దుర్గా పూజ పురస్కరించుకుని గ్యాంగ్‌టక్‌లో సెలవు.
ఇక అక్టోబర్ 16న లక్ష్మీ పూజ సందర్భంగా కోల్‌కతా, అగర్తలలో సెలవు. అక్టోబర్ 17న బెంగళూరు, గౌహతిలో మహర్షి వాల్మికి జయంతి సెలవు. అక్టోబర్ 20న ఆదివారం సెలవు. అక్టోబర్ 26 నాలుగవ శనివారం దేశమంతా సెలవు. అక్టోబర్ 27 ఆదివారం సెలవు. అక్టోబర్ 31 దీపావళి సెలవు.