RBI Summer Internship 2024: రిజర్వ్‌ బ్యాంకు సమ్మర్‌ ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌.. నెలకు రూ.20,000 స్టైఫండ్‌ పొందే సువర్ణావకాశం..

Wed, 16 Oct 2024-10:57 am,

RBI Summer Internship programme 2024: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌ ప్రారంభించింది. ఇది నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ ఆసక్తి ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్‌ క్షుణ్నంగా చదివి దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌కు కావాల్సిన అర్హత వివరాలు తెలుసుకుందాం.

ఆర్‌బీఐ ఇంటర్న్‌షిప్‌ 2024 అర్హత.. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇంటర్న్‌షిప్‌ కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు కలిగి ఉండాల్సిన అర్హత వివరాలు.. పోస్ట్‌ గ్రాడ్యూయేట్‌ కోర్స్‌ చేసి ఉండాలి. 

మేనేజ్మెంట్‌, స్టాటిస్టిక్స్‌, లా, కామర్స్‌, ఎకనామిక్స్‌, ఎకానొమేట్రిక్స్‌, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ విభాగాల్లో 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌ చేసి ఉండాలి.న్యాయ శాస్త్రంలో పొఫెషనల్‌ బ్యాచిలర్‌ డిగ్రీ ఫుల్‌ టైం చేసి ఉండాలి.  

రిజర్వ్‌ బ్యాంక్‌ అధికారిక నోటిఫికేషన్‌ ప్రకారం కేవలం 125 మంది విద్యార్థులను మాత్రమే ఈ ఇంటర్న్‌షిప్‌కు ఆర్‌బీఐ ఎంపిక చేస్తుంది. సమ్మర్‌ లో ఈ ప్లేస్‌మెంట్స్‌ ఉంటాయి. జనవరి, ఫిబ్రవరీ నెలల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. అన్ని విభాగాల్లో అర్హత సాధించిన విద్యార్థుల పేర్లను షార్ట్‌లిస్ట్‌ చేస్తుంది.   

ఆర్‌బీఐ వివిధ బ్రాంచీ ఆఫీసుల్లో వారికి ఇంటర్న్‌షిప్‌ అవకాశాన్ని కల్పిస్తుంది. ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ట్రావెలింగ్‌ ఖర్చులు భరించాల్సి ఉంటుంది. ఫిబ్రవరీ, మార్చి నెలల్లో ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల చేస్తారు.  

ఆర్‌బీఐ సమ్మర్‌ 2024 ఇంటర్న్‌షిప్‌ స్టైపెండ్‌.. ఈ సమ్మర్‌ ఆర్‌బీఐ ఇంటర్న్‌షిప్‌ లో ఎంపికైన విద్యార్థులకు ప్రతినెలా రూ.20,000 స్టైపెండ్‌ లభిస్తుంది. ఇతర దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు కూడా తమ ట్రావెలింగ్‌ ఖర్చులను భరించాల్సి ఉంటుంది.

రిజర్వ్‌ బ్యాంక్‌ సమ్మర్‌ ఇంటర్న్‌షిప్‌ 2024 ముఖ్యమైన గైడ్‌లైన్స్‌ ఇవే.. ఫారమ్‌ క్షుణ్నంగా చదివిన తర్వాత విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత ఎలాంటి మార్పులు చేయరు. అప్లికేషన్‌ పూర్తిగా నింపాలి. ఫోటో, సిగ్నేచర్‌, కాలేజ్‌ ఆథారైజేషన్‌ లెట్టర్‌, బోనాఫైడ్‌ లేకుంటే దరఖాస్తును రిజెక్ట్ చేస్తారు. విద్యార్థులు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలి. చివరగా సర్వర్‌ డౌన్‌, ఇతర ఇంటర్నెట్ సమస్యలు ఎదురవుతాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link