Realme 5g smartphone: అతి తక్కువ ధరలో 5జి స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తుంది

Fri, 13 Nov 2020-6:47 pm,

రియల్ మి ట్వీట్ ద్వారా లాంచ్ చేయబోతున్న రియల్ మి7  5జి స్మార్ట్‌ఫోన్  ఫోటోను షేర్ చేసింది. ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ రీడర్ ఉంటుంది. 

 

రియల్ మి కంపెనీ ఇంతకుముందే రియల్ మి 7ఐను లాంచ్ చేసింది. స్మార్ట్‌ఫోన్ 6.5 ఇంచెస్ డిస్ ప్లేతో ఉంటుంది. ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రోసెసర్‌తో ఉంటుంది. ఇందులో 8 జిబి ర్యామ్, 128 స్టోరేజ్ ఉంది. 

 

రియల్ మి కంపెనీకు చెందిన ఈ  స్మార్ట్‌ఫోన్ 11 వేల 999 రూపాయల ప్రారంభధరలో అందుబాటులో ఉండనుంది. ఈ ధరలో 4 జిబి ర్యామ్ 64 జిబి స్టోరేజ్ ఉంటుంది. ఇదే ఫోన్ 4 జిబి ర్యామ్, 128 స్టోరేజ్ తో మాత్రం 12 వేల 999 రూపాయలకు లభించనుంది. 

 

రియల్ మి కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్‌ను ఫ్యూజర్ గ్రీన్, ఫ్యూజన్ బ్లూ రంగుల్లో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ నవంబర్ 16న అందుబాటులో వస్తుంది. రియల్ మి ఆన్‌లైన్ స్టోర్ లేదా ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తుంది. 

 

8ఎంపి అల్ట్రా‌వైడ్ యాంగిల్ లెన్స్, 2 ఎంపి మోనోక్రోమ్ సెన్సార్, 2 ఎంపి డెప్త్ సెన్సార్‌తో పాటు 64 ఎంపీ ప్రైమరీ కెమేరాతో క్వాడ్ కెమేరా సెటప్‌ను సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీ కోసం 16 ఎంపి సెన్సార్ ఉంది. ఇది 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంది. 

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link