Realme Techlife 7.5 Kg Washing Machine: ఫ్లిఫ్‌కార్ట్‌లో 7.5 కిలోల 5 స్టార్ రేటింగ్ రూ.4 వేలకే.. ఇలాంటి గొప్ప అవకాశం మళ్లీ రాదు!
గతంలో రియల్‌మీ లాంచ్ చేసిన 7.5 కిలోల సామర్థ్యం కలిగిన సెమీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. ఇక దీనిపై ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఇవే కాకుండా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
ఇక ఈ వాషింగ్ మెషిన్ 7 kg, 7.5 kg, 8 kg, 8.5 kg నాలుగు కెపాసిటీల్లో అందుబాటులో ఉంది. అంతేకాకుండా మూడు కలర్ ఆప్షన్స్‌లో లభిస్తోంది. ఫ్లిఫ్‌కార్ట్‌లో ఇయర్ ఎండ్ సేల్‌లో భాగంగా 7.5 kg కెపాసిటీ కలిగిన వాషింగ్ మెషిన్‌పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది.
ఈ వాషింగ్ మెషిన్ మార్కెట్‌లో MRP ధర రూ.13,990తో అందుబాటులో ఉండగా.. అయితే దీనిని ఇయర్ ఎండ్ సేల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి దాదాపు 42 శాతం వరకు ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ వాషింగ్ మెషిన్ కేవలం రూ.7,990కే పొందవచ్చు.
ఇక ఈ realme TechLife 7.5 kg సామర్థ్యం కలిగిన వాషింగ్ మెషిన్‌పై అదనంగా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. దీనిని వినియోగించడానికి క్రెడిట్ కార్డ్స్‌తో పేమెంట్ చేయాల్సి ఉంటుంది.
దీనికి సంబంధించిన బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే..HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను వినియోగించి పేమెంట్ చేస్తే దాదాపు రూ.1,000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఇక అన్ని ఆఫర్స్ పోనూ రూ.6,990కే పొందవచ్చు. ఇక దీనిపై ఎక్చేంజ్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. దీనిని వినియోగించి కొనుగోలు చేసేవారికి రూ.2,300 వరకు బోనస్ లభిస్తుంది. ఇక ఆఫర్స్ అన్ని పోనూ.. రూ.4,690కే పొందవచ్చు.