Ganesh Nimajjanam 2024: గణేష్ నవరాత్రి పూజల్లో ‘గణపతి బప్ప మోరియా’ అనే నినాదాలు ఎందుకు చేస్తారో తెలుసా..!

Mon, 16 Sep 2024-12:11 pm,

Ganesh Nimajjanam 2024: గణపతి బప్పా మోరియా అని భాషా, ప్రాంతీయ భేదాల్లేకుండా  మనం ప్రతి వినాయక మండపంలో నినదిస్తూ ఉంటాము. అసలు ఈ నినాదం వెనక పెద్ద కహానే ఉంది. 15వ శతాబ్దంలో ‘మోరియా గోసాని’ అనే సాధువు ఉండేవాడు. అతను మహారాష్ట్రలోని పుణెకు 21 కిలో మీటర్ల దూరంలో చించ్ వాడి అనే గ్రామ నివాసి.

‘మోరియా గోసావి’ అనే భక్త శిఖామణి గణపతిని పూజించేందుకు చించ్ వాడి నుంచి మోరే గావ్ వరకు ప్రతి రోజూ కాలినడకన వెళ్లేవాడట. అలా  ఓ రోజు మోరియా నిద్రిస్తూన్న సమయంలో విఘ్న వినాయకుడు కలలో కనిపించి..తాను సమీపంలో ఉన్న నదిలో విగ్రహ రూపంలో ఉన్నానని చెప్పాడట. నిద్రలోంచి లేచి చూడగా.. అది కల అని తెలుసుకున్నాడు. ఇక స్వప్నంలో విఘ్నేశ్వరుడు చెప్పిన మాట ప్రకారం అది కలయో.. నిజమో తెలుసుకోవాలని మోరియా సమీపంలోని నదిలోకి వెళ్లాడు.

కలలో ఏకదంతుడు చెప్పినట్టుగానే  చెప్పినట్టుగానే నదిలో మోరియాకు విఘ్నాలను తొలిగించే విఘ్నేశ్వరుడి విగ్రహం దొరికింది. ఈ విషయం తెలుసుకున్న అక్కడి స్థానికులు మోరియా గోసావి ఎంత గొప్పవాడు కాకపోతే సాక్షాత్తు గజాననుడు కలలో కనిపిస్తాడు అంటూ.. మోరియాను చూసేందుకు ఉన్న ఊరు ఒదలి తండోపతండాలుగా  వచ్చారట.

అంతేకాదు మోరియా గోసావి పాదాలను తాకి మోరియా అనటం  మొదలుపెట్టారు. మోరియా గోసావి నిజంగా మంగళమూర్తియే అంటూ మొక్కారట. నది నుండి తెచ్చిన మహా గణేషుడి ప్రతిమను తెచ్చి గుడిని నిర్మించాడట. మోరియా గొప్ప భక్తుడు అయ్యాడు కాబట్టి నాటి నుంచి గణపతి ఉత్సవాల్లో మోరియా గోసావి పేరు గణపతి ఉత్సవాల్లో బాగమైపోయింది.

ఆనాటి నుంచి గణపతి బప్పా మోరియా..అనే నినాదం నిర్విరామంగా వినబడుతూనే ఉంది. భక్త వల్లభుడైన గజకర్ణుడు సేవలలో మోరియా గోసావి తరించిపోయాడు అందుకే నదిలో నిమజ్జనం చేసే ముందు గణపతి బప్పా మోరియా పూడ్చ వర్సీ లౌకర్ యా.. అని మరాఠీ లో నినదించడం సర్వ సాధారణమైపోయింది. ఎందుకంటే గణపతి ప్రతిమ మోరియకు మహారాష్ట్రలోని పూణే సమీపంలో ప్రవహించే నదిలోనే దొరికింది కాబట్టి.. దేవుడు తన కార్యం ఏదైనా భక్తుల ధ్వారనే నెరవేర్చుకుంటాడు అనడానికి మోరియా గోసావి జీవిత కథనే నిదర్శనం.అందుకే ‘గణపతి బప్పా మోరియా’ అనే పదం ఇపుడు సర్వ సాధారణమైపోయింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link