Corona Vaccine: కరోనా విజేతలపై ఆసక్తికర విషయం, COVID-19 Vaccine ఒక్క డోసు ఇస్తే చాలు

Fri, 05 Feb 2021-2:14 pm,

కరోనా మహమ్మారి బారిన పడి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కొందరు కరోనా బారి నుంచి కోలుకున్నా, దాని వల్ల కలిగిన దుష్పరిణామాల కారణంగా చనిపోయారు. ఆరోగ్య, పారిశుద్ధ కార్మికులు, ఫ్రంట్‌లైన్ వారియర్స్ త్యాగాల ఫలితంగా భారత్‌లోనూ 95 శాతం మంది కోవిడ్-19 మహమ్మారిని జయించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్(Corona Vaccine) పంపిణీ విజయవంతంగా కొనసాగుతోంది.

Also Read: Effect Of COVID-19 Vaccine: కరోనా టీకాల ప్రభావం.. అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే!

అయితే కరోనా మహమ్మారిని జయించిన వారిపై చేసిన అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి. కరోనా బారి నుంచి కోలుకున్న వారు ఒక్క డోసు కొవిడ్‌ టీకా(Covid19-Vaccine) తీసుకుంటే సరిపోవచ్చని అమెరికా సహా పలు దేశాల శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

కోవిడ్-19 మహమ్మారిని జయించిన వారిలో ఇదివరకే యాంటీబాడీలు అభివృద్ధి చెంది ఉంటాయి. దీనివల్ల వీరిలో రోగనిరోధక వ్యవస్థ కొంతకాలం వరకు పటిష్టంగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Also Read: COVID-19 Vaccine: కరోనా టీకా తీసుకున్నా.. వీరికి అంతగా పనిచేయదు!

ఇటీవల కరోనా నుంచి కోలుకున్న కొందరిపై ప్రయోగం చేశారు. కరోనా విజేతల్లో కొందరికి ఫైజర్ వ్యాక్సిన్, మరికొందరికి మోడెర్నా టీకాలు ఇచ్చారు. కేవలం వారం రోజుల వ్యవధిలో యాంటీబాడీలు అధికంగా ఉత్పత్తి అయినట్టు గుర్తించారు.

Also Read: COVID-19 Vaccine: కరోనా వ్యాక్సిన్ తీసుకునే మద్యం ప్రియులకు చేదువార్త..

కరోనా సోకని వారిలో రెండు డోసులు ఇచ్చినా కనిపించిన దానికన్నా కరోనాను జయించి ఒక్క డోసు టీకా తీసుకున్న వారిలోనే మంచి ఫలితాలను రీసెర్చర్లు గుర్తించారు. అయితే రెండు పర్యాయాలు డోసులు ఇవ్వడమే శ్రేయస్కరమని కూడా కొందరు నిపుణులు సూచిస్తున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link