Redmi 12 5G Price: వినాయక చవితి స్పెషల్‌ డిస్కౌంట్‌ ఆఫర్..Redmi 12 మొబైల్‌ కేవలం రూ. 549కే పొందండి..

Sat, 16 Sep 2023-3:15 pm,

ఈ Redmi 12 స్మార్ట్‌ఫోన్‌ ఫ్లిఫ్‌కార్ట్‌లో రెండు వేరియంట్స్‌లో లభిస్తోంది. మొదటి వేరియంట్‌ 4 GB +  128 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌, రెండవ వేరియంట్‌ 6 GB + 128 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ మొబైల్‌ మూడు విభిన్న రంగులను కలిగి ఉంటుంది.  

ఫ్లిఫ్‌కార్ట్‌లో Redmi 12 మొబైల్‌ను ధరతో రూ. 14,999తో విక్రయిస్తోంది. వినాయక చవితి సందర్భంగా ఈ స్మార్ట్‌ ఫోన్‌ 33 శాతం తగ్గింపుతో కేవలం రూ. 9,999కే లభిస్తోంది. అంతేకాకుండా మరింత తగ్గింపు పొందడానికి బ్యాంక్‌ ఆఫర్స్‌ను వినియోగించాల్సి ఉంటుంది.  

ఈ స్మార్ట్‌ ఫోన్‌పై మరింత తగ్గింపు పొందడానికి ఫ్లిఫ్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించాల్సి ఉంటుంది. ఈ కార్డ్‌తో Redmi 12 మొబైల్‌ కొనుగోలు చేసే క్రమంలో బిల్‌ చెల్లిస్తే దాదాపు 5 శాతం తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా మీరు రెడ్‌ మీ పవర్‌ బ్యాంకుపై అదనంగా 5 శాతం తగ్గింపు కూడా పొందుతారు. 

Redmi 12 స్మార్ట్‌ ఫోన్‌పై అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందిస్తోంది ఫ్లిఫ్‌కార్ట్‌..అయితే ఈ ఆఫర్‌ వినియోగించడానికి మీరు వినియోగించే పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. పాత మొబైల్‌ కండీషన్‌ బాగుంటే దాదాపు రూ.9,450 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ మొబైల్‌ను రూ.549 లభిస్తుంది.   

Redmi 12 మొబైల్‌ ప్రీమియం ఫీచర్స్‌తో లభిస్తోంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ 50MP బ్యాక్‌ కెమెరా, 8MP ఫ్రంట్‌ కెమెరాను కలిగి ఉంటుంది. దీంతో పాటు 5000 mAh బ్యాటరీతో లభిస్తోంది. ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌ Helio G88 ప్రాసెసర్‌పై పని చేస్తుంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link