Jio vs Vodafone, idea, Airtel: ఇంటర్నెట్ స్పీడ్‌లో ఏది ఎక్కువ ? ఏది తక్కువ తెలుసా ?

Thu, 17 Dec 2020-6:32 am,

ఇంటర్నెట్ డౌన్‌లోడ్ స్పీడ్‌లో రిలయన్స్ జియో కింగ్ అని ట్రాయ్ ( TRAI ) నిగ్గు తేల్చింది. అలాగే అప్ లోడింగ్ స్పీడ్‌లో వొడాఫోన్ టాప్ అని తేలింది. నవంబర్ నెలకుగాను ట్రాయ్ వెల్లడించిన గణాంకాల నివేదికలో ఈ విషయం స్పష్టమైంది.

నవంబర్‌లో 20.8 ఎంబీపీఎస్ స్పీడ్‌తో రిలయన్స్ జియో ఇంటర్నెట్ డౌన్ లోడింగ్ స్పీడ్ బాగా పనిచేసింది. అలాగే వొడాఫోన్ విషయానికొస్తే.. నవంబర్ నెలలో 6.5 ఎంబీపీఎస్ స్పీడుతో అప్ లోడింగ్ కేటగిరీలో తొలి స్థానంలో నిలిచింది. ( Image credits : Reuters )

డౌన్‌లోడింగ్ స్పీడులో తన ప్రత్యర్థి అయిన వొడాఫోన్‌తో పోల్చుకుంటే రెండు రెట్లు కంటే అధిక స్పీడుతో రిలయన్స్ జియో ( Reliance Jio ) దూసుకుపోయింది. వాస్తవానికి ఐడియా సెల్యూలార్, వొడాఫోన్ సంస్థలు ఒక్కటిగా మారి వొడాఫోన్ ఐడియాగా అవతరించినప్పటికీ.. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా మాత్రం డేటా స్పీడ్‌ లెక్కింపు విషయంలో రెండింటినీ వేరువేరుగానే పరిగణిస్తోంది.  ( Image credits : Reuters )

నవంబర్‌లో వొడాఫోన్ ఇంటర్నెట్ డౌన్‌లోడింగ్ స్పీడ్ 9.8 mbps గా నమోదు కాగా ఆ తర్వాత స్థానాల్లో 8.8 ఎంబీపీఎస్‌ స్పీడుతో ఐడియా, 8 ఎంబీపీఎస్ స్పీడ్‌తో భారతి ఎయిర్‌టెల్ ( Airtel internet speed ) నిలిచాయి.

అప్ లోడింగ్ స్పీడులో 6.5 ఎంబీపీఎస్‌తో వొడాఫోన్‌లో ( Vodafone uploading speed ) టాప్‌లో నిలవగా ఆ తర్వాత 5.8 ఎంబీపీఎస్ స్పీడుతో ఐడియా, 4 ఎంబీపీఎస్ స్పీడుతో ఎయిర్‌టెల్ ఉన్నాయి. డౌన్ లోడింగ్ స్పీడులో టాప్‌లో నిలిచిన రిలయన్స్ జియో.. అప్ లోడింగ్ స్పీడులో ( Jio internet speed ) మాత్రం 3.7 ఎంబీపీఎస్‌తో వొడాఫోన్, ఐడియా ( Idea internet speed ), ఎయిర్‌టెల్ లాంటి కాంపిటీటర్స్ కంటే ఎంతో వెనుకబడింది.

డౌన్ లోడింగ్ స్పీడ్ అంటే.. ఇంటర్నెట్‌లో ఏదైనా శోధించేటప్పుడు ఉండే వేగాన్ని డౌన్ లోడింగ్ స్పీడ్ అంటారు.

అలాగే అప్ లోడింగ్ స్పీడ్ అంటే.. మీ సిస్టం నుంచి కానీ లేదా ఇంటర్నెట్ నుంచి కానీ ఏదైనా డేటాను ఇతరులతో పంచుకునే సమయంలో ఉండే ఇంటర్నెట్ వేగాన్నే అప్ లోడింగ్ స్పీడ్ అంటారు.

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI ) మై స్పీడ్ అప్లికేషన్ అనే యాప్ ( My speed application ) ద్వారా దేశవ్యాప్తంగా రియల్ టైమ్ పద్ధతిలో ఇంటర్నెట్ డౌన్‌లోడింగ్, అప్‌లోడింగ్ స్పీడుని లెక్కిస్తుంది.

Also read : 7th Pay Commission: గుడ్ న్యూస్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు పెరగనున్న జీతాలు

Also read : How to apply for MUDRA loan: ముద్ర లోన్‌కి ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి ?

Also read : Christmas Star: ఆకాశంలో అరుదైన క్రిస్మస్ స్టార్.. ఇప్పుడు తప్పితే మళ్లీ ఎప్పుడో

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link