Reliance Jio: కేవలం రూ.22తో రిలయన్స్ జియో డేటా ప్లాన్, తక్కువ ధరకు ఎన్నో ప్రయోజనాలు

Thu, 04 Mar 2021-9:53 am,

Jio Prepaid Data Vouchers: కస్టమర్లకు రిలయన్స్ జియో శుభవార్త అందించింది. భారతదేశపు అతిపెద్ద మరియు ప్రముఖ టెలికమ్యూనికేషన్ కంపెనీ అయిన రిలయన్స్ జియో అన్‌లిమిటెడ్ కాలింగ్ మరియు డేటా ఆఫర్ వంటి ప్లాన్స్ తీసుకొస్తుంది. తాజాగా తమ వినియోగదారులకు తక్కువ ధరలో అందిస్తున్న రీఛార్జ్ ప్లాన్ల వివరాలు ఇక్కడ అందిస్తున్నాం.

Also Read: Cheapest Recharge Plans: రూ.100 కన్నా తక్కువ ధరలో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ అందిస్తున్న ఎయిర్‌టెల్, జియో మరియు Vi

రిలయన్స్ జియో (Reliance Jio) తన జియోఫోన్ కస్టమర్ల కోసం ఐదు కొత్త డేటా ప్లాన్‌లను ప్రత్యేకంగా అందిస్తోంది. రూ .22, రూ. 52, రూ .72, రూ .102, రూ. 152 ధరలకు జియో డేటా ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. డేటాను అందించడానికి అన్ని ప్యాక్‌లు తీసుకొచ్చాయి. అంటే మీరు వాటిని అదనపు డేటా కోసం అదనపు ప్యాకేజీగా ఉపయోగించవచ్చు.

Also Read: Jio Recharge Plans: మీకు అధికంగా డేటా కావాలా, Reliance Jio 5 బెస్ట్ డేటా ప్లాన్స్ ఇవే

రిలయన్స్ జియో రూ .22 డేటా వోచర్‌తో 2 జీబీ డేటా, రూ .52తో 6 జీబీ డేటా, రూ .72 రీఛార్జ్ ప్లాన్‌తో వినియోగదారులకు 14 జీబీ డేటా లభిస్తుంది. రోజువారీ డేటా 500MB వరకు ఇంటర్‌నెట్‌ను బ్రౌజింగ్ సదుపాయం కల్పించింది.

Also Read: Extra Data Offer: ఈ ప్లాన్స్‌తో 5 GB ఎక్స్‌ట్రా డేటా మీ సొంతం

రిలయన్స్ జియో రూ .102 మరియు రూ .152 డేటా ప్యాక్‌లు వరుసగా 30 GB, 60 GB డేటాను అందిస్తున్నాయి. మరియు రోజుకు వరుసగా 1 జీబీ, 2 జీబీల డేటా వరకు మీకు లభిస్తుంది. ఈ డేటా ప్లాక్‌ల వ్యాలిడిటీ 28 రోజులుగా నిర్ణయించింది.

Also Read: Cheapest Recharge Plans: కేవలం 2 రూపాయలకే 1 GB డేటా, కాల్స్, మరెన్నో సౌకర్యాలు

ఇటీవల, జియోఫోన్ రూ.749 వార్షిక రీఛార్జ్ ప్లాన్‌ను కంపెనీ ప్రకటించింది. ఇది అపరిమిత వాయిస్ కాలింగ్ (Unlimited Calling) మరియు రోజుకు 2GB డేటాను  ఒక సంవత్సరం అందిస్తుంది. JioPhone ప్రస్తుత వినియోగదారులకు వర్తిస్తుంది.  కొత్త జియోఫోన్ 2021 ఆఫర్‌ ప్రకారం, వినియోగదారులు జియోఫోన్‌ను కొనుగోలు చేస్తే అపరిమిత కాలింగ్ సహా నెలకు 2 GB డేటా చొప్పున రెండేళ్లపాటు పొందవచ్చు. ఫోన్ ధర రూ .1,999. ఇందులోనే రూ .1,499 రీఛార్జ్ ప్లాన్ అందిస్తోంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link