Cheapest Recharge Plans: రూ.100 కన్నా తక్కువ ధరలో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ అందిస్తున్న ఎయిర్‌టెల్, జియో మరియు Vi

Cheapest Recharge Plans Less Than 100 Rupees: తమ వినియోగదారుల కోసం అతి తక్కువ ధరలకే ప్రిపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ఎయిర్‌టెల్, జియో, వోడాఫోన్ ఐడియా అందిస్తున్నాయి. ఒక్కసారి ఆ బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్‌ తెలుసుకోండి.

Written by - Shankar Dukanam | Last Updated : Feb 15, 2021, 02:09 PM IST
  • రూ.100 కన్నా తక్కువలో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ అందిస్తున్న ఎయిర్‌టెల్, జియో
  • వినియోగదారుల కోసం అతి తక్కువ ధరలకే ప్రిపెయిడ్ రీఛార్జ్ ప్లాన్
  • అతి చౌక ధర రీఛార్జ్ ప్లాన్‌లు 28 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉన్నాయి
Cheapest Recharge Plans: రూ.100 కన్నా తక్కువ ధరలో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ అందిస్తున్న ఎయిర్‌టెల్, జియో మరియు Vi

Cheapest Recharge Plans Less Than 100 Rupees: ఎయిర్‌టెల్, జియో, వోడాఫోన్ ఐడియా తమ వినియోగదారుల కోసం అతి తక్కువ ధరలకే ప్రిపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ అందిస్తున్నాయి. ప్రస్తుతం అత్యధికంగా రీఛార్జ్ చేసుకునే ప్లాన్ రూ. 100 కన్నా తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయి.

ఎయిర్‌టెల్, జియో(Jio Recharge Plans) మరియు వొడాఫోన్ ఐడియాలు అందిస్తున్న అతి చౌక ధర రీఛార్జ్ ప్లాన్‌లు 28 రోజుల వ్యాలిడిటీ అందించేవి ఉన్నాయి. కొన్ని ప్లాన్లలో ఉచిత కాలింగ్ సౌకర్యం ఉంది. రూ.100 కన్నా తక్కువ ధర రీఛార్జ్ ప్లాన్ 12GB డేటా పరిమితితో వస్తుంది.  వినియోగదారులు డేటా ఆఫర్లతో పాటు కాలింగ్ ప్లాన్ లేదా రీఛార్జ్ ప్లాన్‌ను మీరు ఎంచుకోవచ్చు.

Also Read: FASTag: నేటి అర్ధరాత్రి నుంచి ఫాస్టాగ్ వాడకం తప్పనిసరి, దీని ఉపయోగం ఏమిటి

వోడాఫోన్ ఐడియా(Vi Recharge Plan) వంద కన్నా తక్కువ ధరలకు రూ.49, రూ.59, రూ.65, రూ.79, రూ.85 కు రీఛార్జ్ ప్లాన్లు అందిస్తోంది. వీటికి 28 రోజుల టాక్ టైమ్ లభిస్తుంది. 400 MB డేటా సైతం వినియోగదారులకు అందిస్తుంది. Vi యొక్క రూ.98 రీఛార్జ్ ప్లాన్‌లో డ్యూయల్ డేటా ఆఫర్ సైతం పొందవచ్చు. 28 రోజులు వ్యాలిడిటీతో 12GB డేటాను ఉపయోగించుకుంటారు.

Also Read: Ben Cutting Wedding Photos: మిస్ వరల్డ్ ఆస్ట్రేలియాను వివాహం చేసుకున్న Australia క్రికెటర్ బెన్ కటింగ్

రూ.100 కన్నా తక్కువ ధరలకు ఎయిర్‌టెల్(Airtel Recharge Plans) రూ.45, రూ.49, రూ.79 రీఛార్జ్ ప్లాన్‌లు ఉన్నాయి. వీటి వ్యాలిడిటీ 28 రోజులు.  ఎయిర్‌టెల్ రూ.48 ప్లాన్‌కు 3 జీబీ డేటా లభిస్తుంది. రూ. 98 రూపాయల రీఛార్జ్ ప్లాన్ ద్వారా 12 జీబీ డేటా వాడుకోవచ్చు.

Also Read: Mutual Funds: రోజుకు రూ.70 ఇన్వెస్ట్ చేసి రూ.1 కోటి వరకు పొందవచ్చు, Best Plan వివరాలు మీకోసం

రిలయన్స్ జియో మీకు రూ.20, రూ.50 మరియు రూ.100 టాక్ టైమ్ ప్లాన్లు అందిస్తుంది. రూ.11, రూ.21, రూ.51, రూ.101 రీఛార్జ్ ప్లాన్లతో డేటా లభిస్తుంది. ఈ రీఛార్జ్ మీకు 1GB, 2GB, 6GB మరియు 12GB డేటా ఇస్తుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News