Jio Recharge Plan: జియో నుంచి సూపర్ ప్లాన్, కేవలం 223 రూపాయలకే 56 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్
జియో 223 రీఛార్జ్ ప్లాన్
జియో అందిస్తున్న ఈ ప్లాన్ టారిఫ్ 223 రూపాయలు మాత్రమే. ఈ ప్లాన్‌లో రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుంటుంది. అంటే మొత్తం 56 జీబీ డేటా ఉంటుంది.
తక్కువ ధరలో అత్యధిక డేటా
జియో అందించే ఈ కొత్త ప్లాన్‌లో యూజర్లకు ప్రతిరోజూ అత్యధిక డేటా లభిస్తుంది. డేటాతో పాటు ఇతర రెగ్యులర్ బెనిఫిట్స్ ఉండనే ఉంటాయి.
రిలయన్స్ జియో రీ ఛార్జ్ ప్లాన్స్
రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు సరికొత్త ప్లాన్స్ అందిస్తుంటుంది. ఒక్కో ప్లాన్‌లో ఒక్కో రకమైన ప్రయోజనాలు అందుతుంటాయి. యూజర్ల అవసరాలకు అనుగుణంగా జియో ప్లాన్స్ ఉంటాయి.
ఇతర ప్రయోజనాలు
ఈ ప్లాన్‌లో జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ సేవలు ఉచితంగా లభిస్తాయి. ఈ ప్లాన్ కేవలం జియో యూజర్లకే వర్తిస్తుంది.
అన్‌లిమిటెడ్ కాలింగ్
ఈ ప్లాన్‌లో అన్ లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం ఉంటుంది. అంటే 28 రోజుల వరకు ఎలాంటి ఆటంకం లేకుండా అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. దీంతోపాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉంటాయి.