Reliance Jio IPO: అతి త్వరలో రిలయన్స్ జియో ఐపీవో..దేశంలోని అతి పెద్ద ఐపీవోకు రంగం సిద్ధం అవుతోందా..?

Mon, 04 Nov 2024-7:12 pm,

Reliance Jio IPO: దేశంలోనే అతిపెద్ద టెలికాం కంపెనీగా అవతరించిన రిలయన్స్ జియో అతి త్వరలోనే ఐపీఓ ద్వారా మార్కెట్లోకి ప్రవేశించనుంది. ఒకవేళ ఇది మార్కెట్లోకి ప్రవేశించినట్లయితే మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపిఓగా అవతరించి అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

2025వ సంవత్సరంలో రిలయన్స్ జియో ఐపీవో మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం ఉందని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. .రాయిటర్స్ రిపోర్టులో ఇలా పేర్కొంది "ముఖేష్ అంబానీకి చెందిన టెలికాం, ఓటీటీ మీడియా సంస్థ జియో  2025లో స్టాక్ మార్కెట్ లిస్టింగ్‌ను లక్ష్యంగా పెట్టుకుంది, 100 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువ కలిగిన ఐపీవోగా ఇది మార్కెట్లోకి ప్రవేశించవచ్చని  రిపోర్ట్ పేర్కొంది.   

2019లోనే రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్ ఐదేళ్లలోపే ఐపీవో మార్కెట్లోకి ప్రవేశిస్తుందని ముఖేష్ అంబానీ చెప్పారు. అయితే అప్పటి నుంచి దీనిపై ఎలాంటి అప్‌డేట్‌ లేదు. ప్రస్తుతం భారతీయ స్టాక్ మార్కెట్లు ఇటీవల రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అక్టోబర్2024 నాటికి 270 కంపెనీలు ఈ సంవత్సరం IPO ద్వారా 12.58 బిలియన్ డాలర్లను సేకరించాయి. ఈ నేపథ్యంలో 2025 సంవత్సరంలో రిలయన్స్ జియో ఐపీవో వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు ఆశిస్తున్నాయి.   

జియో ప్రస్తుతం భారతదేశంలో అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌గా ఉంది, ఆగస్టు 2024 నాటికి 471 మిలియన్లకు పైగా యూజర్లు ఉన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ డిజిటల్, టెలికాం, రిటైల్ వ్యాపారాల కోసం KKR, అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, జనరల్ అట్లాంటిక్, ఇతర పెట్టుబడిదారుల నుండి 25 బిలియన్ డాలర్లకు పైగా సేకరించింది.   

ప్రస్తుత నిబంధనల ప్రకారం 1 లక్ష కోట్లు లేదా అంతకంటే ఎక్కువ విలువ కలిగి కంపెనీలు IPO సమయంలో మొత్తం షేర్లలో కనీసం 5 శాతం విక్రయించాల్సి ఉంటుంది. దీని ప్రకారం జెఫరీస్ సంస్థ ప్రస్తుతం జియో విలువను 112 బిలియన్ డాలర్లు (రూ. 9.42 లక్షల కోట్లు)గా నిర్ణయించింది. ఈ లెక్కన చూస్తే అందులో 5% వాటా విక్రయించాల్సి వస్తే IPO విలువ దాదాపు రూ. 47,100 కోట్లకు వెళ్తుంది.    

ఇటీవల ముగిసిన హ్యుందాయ్ మోటార్ ఇండియా IPO కంటే ఇది చాలా  ఎక్కువ అవుతుంది. అలాంటి స్థితిలో, జియో యొక్క IPO భారతదేశపు అతిపెద్ద IPO అవుతుందని మార్కెట్ వర్గాలు నమ్ముతున్నాయి. మరోవైపు రిలయన్స్ రిటైల్ ఐపీఓ కూడా వస్తుందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే ఐపిఓ మార్కెట్ ద్వారా లాభాలు పొందాలి అని చూసేవారికి ఇది ఒక చక్కటి అవకాశం అని చెప్పవచ్చు.   

డిస్ క్లయిమర్ : పైన పేర్కొన్న సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎలాంటి పెట్టుబడి సలహాలు ఇవ్వదు. మీరు పెట్టే పెట్టుబడులకు మీరే బాధ్యులు. ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు రిస్కుకు లోబడి ఉంటాయి.  స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల కోసం సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల సలహా తీసుకోండి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link