Jio New Recharge Plans: ఈ ఆరు దేశాలకు వెళ్తున్నారా, జియో నుంచి బెస్ట్ రోమింగ్ రీఛార్జ్ ప్లాన్స్ ఇవే
జియో థాయ్‌లాండ్ రీఛార్జ్ ప్లాన్
ఈ ప్లాన్ థాయ్‌లాండ్ కోసం. ఇందులో 1551 రూపాయల ప్లాన్ 14 రోజుల వ్యాలిడిటీని, 2851 రూపాయల ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంటుంది.
జియో యూఏఇ రీచార్జ్ ప్లాన్
ఈ ప్లాన్ యూఏఇ దేశానికి వర్తిస్తుంది. 898 రూపాయలు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ కేవలం 7 రోజులు. ఇందులో డేటా, ఎస్ఎంఎస్, కాలింగ్ సౌకర్యం ఉంటుంది. ఇందులోనే 1598 రూపాయలు ప్లాన్ 14 రోజుల వ్యాలిడిటీతోనూ, 2998 రూపాయల ప్లాన్ 21 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంటుంది.
జియో సౌదీ అరేబియా రీఛార్జ్ ప్లాన్
ఇది సౌదీ అరేబియాలో పనిచేస్తుంది. మూడు ప్లాన్స్ ఉన్నాయి. 891 రూపాయల ప్లాన్ 7 రోజులకు, 1291 రూపాయల ప్లాన్ 14 రోజులకు, 2891 రూపాయల ప్లాన్ 30 రోజులకు పనిచేస్తుంది.
జియో యూరప్ రీఛార్జ్ ప్లాన్
యూరప్ దేశాల్లో పనిచేస్తుంది. ఒకే ఒక ప్లాన్ ఉంది. 2899 రూపాయ రీఛార్జ్ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది.
జియో కరిబియన్ రీజన్ రీఛార్జ్ ప్లాన్
కరీబియన్ ప్రాంతంలో పనిచేస్తుంది. రెండు ప్లాన్స్ ఉన్నాయి. 1671 రూపాయల రీఛార్జ్ ప్లాన్ 14 రోజుల వ్యాలిడిటీని, 3851 రూపాయల ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంటుంది.
జియో కెనడా రీఛార్జ్ ప్లాన్
ఇది కెనడాలో పనిచేస్తుంది. ఇందులో రెండు ప్లాన్స్ ఉన్నాయి. 1691 రూపాయల ప్లాన్ 14 రోజుల వ్యాలిడిటీని, 2881 రూపాయల ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంటుంది.