SECI: అనిల్ అంబానీకి భారీ ఊరట.. రిలయన్స్ పవర్ షేర్లలో అప్పర్ సర్క్యూట్ ..ఇన్వెస్టర్లకు లాభాలే లాభాలు

Thu, 05 Dec 2024-1:25 pm,

Anil Ambani Stocks:  భారత దిగ్గజ పారిశ్రామిక వ్యాపారవేత్తలో అనిల్ అంబానీ ఒకరు. ఆయనకు చెందిన రిలయన్స్ పవర్ స్టాక్ డిసెంబర్ 4 సెషన్లో అప్పర్ సర్క్యూట్ కొట్టింది. కిందటి సెషన్లో రూ. 39.14వద్ద ముగిసిన షేరు..నేడు డిసెంబర్ 5 ఎన్ఎస్ఈ లో డైరెక్ట్ 4.98 శాతం అప్పర్ సర్క్యూట్ తో రూ. 41.09 దగ్గర ఓపెనై అక్కడే లాక్ అయ్యింది. 

ఇటీవల సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ రిలయన్స్ పవర్ సహా దాని సబ్సిడరీలపై చర్యలు తీసుకుంది. భవిష్యత్తులో మూడేళ్ల పాటు సెకీ నిర్వహించే బిడ్డింగ్స్ లో పాల్గొనకుండా నిషేధం విధించింది.

నవంబర్ 6వ తేదీన దీనికి సంబంధించిన కంపెనీకి నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు మాత్రం ఆ నోటీసులను విత్ డ్రా చేసుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో నిషేధం ఎత్తవేసినట్లయ్యింది. ఈ క్రమంలోనే రిలయన్స్ పవర్ షేర్లు ఒక్కసారి పుంజుకుంటున్నాయి.   

 రిలయన్స్ పవర్‌పై నిషేధం ఎత్తివేసిన తర్వాత, గత ట్రేడింగ్ సెషన్‌లో కంపెనీ షేర్లు (రిలయన్స్ పవర్ షేర్) అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. ఈరోజు కూడా కంపెనీ షేర్లు అప్పర్ సర్క్యూట్‌లో ఉన్నాయి. బుధవారం కంపెనీ షేర్లు ఒక్కో షేరు రూ.41.09 వద్ద ముగిశాయి. అక్టోబర్ 4, 2024న కంపెనీ షేర్లు 52 వారాల గరిష్ట స్థాయి రూ.53.72కి చేరాయి. దీని తరువాత, కంపెనీ షేర్లలో భారీ క్షీణత.. షేరు ధర రూ.33కి దిగజారింది. అయితే, ఇప్పుడు ఈ స్టాక్ కనిష్ట స్థాయి నుంచి కాస్త కోలుకుంది.

గత ఒక సంవత్సరంలో, రిలయన్స్ పవర్ షేర్లు 93.45 శాతం రాబడిని ఇచ్చాయి. ఈరోజు కంపెనీ షేర్లు ఒక్కో షేరుకు రూ.43.14కి చేరాయి (రిలయన్స్ పవర్ షేర్ ధర).ఈరోజు ఉదయం ఐటీ షేర్లలో కొనుగోళ్లు జరగడం మార్కెట్ లాభపడింది. అయితే, తర్వాత మార్కెట్ క్షీణించింది. 12 గంటల సమయానికి సెన్సెక్స్ 0.22 శాతం నష్టంతో 80,775.64 పాయింట్ల వద్ద, నిఫ్టీ 0.35 శాతం క్షీణించి 24,382.75 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి.

నకిలీ బ్యాంక్ గ్యారెంటీలు సమర్పించినట్లు తేలడంతో కొద్ది రోజుల కిందట రిలయన్స్ పవర్ తోపాటుగా అనుబంధ సంస్థలపై సెకీ నిషేధం విధించింది. సెకీ జూన్ నెలలో 1గిగావాట్ సోలార్ పవర్, 2 గిగావాట్ స్టాండరలోన్ బ్యాటరీ ఎనర్జీ సోలార్ సిస్టమ్ కోసం బిడ్స్ ఆహ్వానించింది. 

రిలయన్స్ పవర్ సబ్సిడరీ రిలయన్స్ ఎన్ యూ బీఈఎస్ఎస్ పాల్గొంది. అక్కడే ఆ సంస్థ ఫేక్ గ్యారెంటీలు సమర్పించినట్లు సెకీ దర్యాప్తులో తేలిందని ప్రకటించింది. ఈ క్రమంలోనే చర్యలుతీసుకుంది. తాజాగా ఈ నిషేధం రిలయన్స్ ఎన్ యూ బీఈఎస్ఎస్ పై ఉంటుందని ఇతర కంపెనీలపై ఉండదని స్పష్టంగా చెప్పింది. దీంతో ఇతర షేర్లు కూడా లాభాల్లో పుంజుకుంటున్నాయి. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link